కేంద్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
--- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాపరెడ్డి
నమస్తే భారత్ / మద్దూరు, (జూన్ 21) : వికసిత భారత్ లో భాగంగా బిజెపి ప్రభుత్వము 11 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 11ఏళ్ల మోడీ పాలన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని విషయాన్ని గ్రామస్థాయి ప్రజలకు తెలియజేయాలని
కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సిపిరి వెంకటయ్య మాట్లాడుతూ
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు నిజమైన అర్హులకు దక్కడం లేదని ప్రభుత్వం మరియు అధికారులు అర్హులను గుర్తించి వారికి కేటాయించాలని అన్నారు.
మద్దూరు మండల బిజెపి అధ్యక్షులు శంకర్ మాట్లాడుతు ప్రధాని మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందు గౌడ్, కే రాములు , గోపాల్ రెడ్డి, తలారి సాయిలు, సిద్ధప్ప, డీకే భరత్, రాఘవేందర్ కె, శ్రీనివాస్ గౌడ్, రొయ్యల నరసింహులు, ఆర్ భరత్, మేకల శ్రీనివాస్, వి.మాధవులు, మహేష్, లక్ష్మణ్, ఉమేష్, నీరెటి భగవంతు, తలారి శ్రీనివాస్, కుర్వ రాము, గోవిందు, అనిల్, బాలకృష్ణ, ప్రశాంత్, మూటకరి వెంకటమ్మ, సి భాస్కర్, దస్తప్ప, ఆనంద్, చిన్న కాశప్ప మరియు మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
