యోగా వల్ల మానసిక, శారీరిక ప్రశాంతత చేకూరుతుంది
మానవ మనుగడకు యోగా చాలా ముఖ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు*
*పోలీసు సిబ్బంది ఆరోగ్యంన్ని కాపాడడానికి యోగ తోడ్పడుతుంది.
సిద్దిపేట: అధికారులకు సిబ్బందికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారి ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజర్ సిద్దిపేట శాఖ సమన్వయంతో కమిషనర్ కార్యాలయ ఆవరణంలో యోగా ఘనంగా నిర్వహించడం జరిగింది*
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగ సీనియర్ శిక్షకురాలు సునీత, అరుణ, శిక్షకురాలు,, యోగా వలన ఉపయోగాల గురించి తెలియజేస్తూ, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, అధికారులకు సిబ్బందికి చేయించడం జరిగింది.
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడం గారు మాట్లాడుతూ
భారతదేశంలో యోగా పుట్టడం మన అందరి అదృష్టమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. యోగ అనేది వయసుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధనమని పేర్కొంటూ, యోగా వల్ల, ఆసనాల వల్ల అనారోగ్య బారిన పడకుండా, శారీరక దృఢత్వాన్ని కాపాడుతూ ఉండవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసులు రేయింబవళ్లు 24 గంటలు విధులను నిర్వర్తిస్తుంటారని వారికి యోగ ఎంతగానో తోడ్పాటు అందజేస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతూ విధులను నిర్వర్తించాలని సూచించారు. యోగ ప్రాణాయామము ఆసనాలు వలన మానసిక, శరీరక విశ్రాంతి, ఉపశమనం లభించి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా పోలీస్ అధికారులు సిబ్బంది వాకింగ్ రన్నింగ్ యోగా ఏదో ఒకటి చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదని ఆరోగ్యం గురించి ప్రతిరోజు సమయం కేటాయిస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. బిపి షుగర్ థైరాయిడ్ ఇతరితర జబ్బులు రాకుండా యోగా బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని
అధికారులకు సిబ్బందికి సూచించారు.
యోగా ఆరోగ్య భాగ్యం ఆనంద యోగం
యోగా వలన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి బలము శరీర బుద్ధి దీర్ఘాయుష్షు పెంపొందించే శారీరక యోగ ఆసనాలు బాగా ఉపయోగపడతాయన్నారు
ప్రాణం అంటే జీవక్రియ ప్రాణాయామం ద్వారా దోషాలు తొలగిపోతాయి శ్వాస నియంత్రణకు యోగా బాగా ఉపయోగపడుతుంది యోగా ద్వారా మనసు బుద్ధి నిర్మలంగా ఉంటుంది.
మనసును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతను పొందడం శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం ద్వారా ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మన జ్ఞానేంద్రియాల అన్నీ నియంత్రణలో ఉంటాయి
ఉత్తమ వ్యక్తిత్వం మానసిక ప్రశాంతత యోగా ద్వారా లభిస్తుంది
త్రికరణశుద్ధిగా జీవించే జీవితం నిజాయితీ శ్రద్ధ ద్వారా ప్రశాంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది యోగ
మనిషికి కావలసింది దృఢమైన శరీరం, తీర్చిదిద్దినట్లుండే సౌష్టం, చక్కటి ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్షు, మదినిండా ఆహ్లాదం, గుండె నిండా ధైర్యం, తరగని ఆనందం, ఇవన్నీ యోగా ద్వారానే లభిస్తాయి
మనిషి ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా శరీరంతోనే చేయాలి దేహాన్ని చురకత్తిలా మార్చాలంటే కొన్ని క్రియలు అనుసరించాలి అవన్నీ యోగా ద్వారానే సాధ్యమవుతుంది
యోగా సాధన పురాతనమైందే అయినా దీని అవసరం ఇప్పుడే ఎక్కువ
మనసుకు నిశ్చలత యోగా ద్వారానే లభిస్తుంది
మనసు నిర్మలంగా నిచ్చలంగా ఉన్నచోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ
శరీరాన్ని మనసును సమతుల్యంలోకి తెచ్చే ఒకే ఒక సాధనం యోగ
శారీరక మానసిక జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆహారపు అలవాట్లు వ్యాయామం లోపం వంటి కారణాలతో ఆరోగ్యం ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది బీపీ డయాబెటిస్ ఊబకాయము కీళ్ల నొప్పులు నడుము నొప్పి ఆందోళన ఒత్తిడి నిద్రలేమి మహిళలలో హార్మోన్స్ మార్పులు ఇలాంటి వాటికి యోగా మరియు ఆసనాలు బాగా ఉపయోగపడి సమతుల్యతను మెరుగుపరుస్తాయి తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపి రవీందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, విద్యాసాగర్, ఉపేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్, విష్ణు ప్రసాద్, కార్తీక్, మరియు పోలీస్ అధికారులు సిబ్బంది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజర్ సిద్దిపేట శాఖ సునీత అనిత టీచర్లు, రాజు మహేందర్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
