ఆడపిల్లలు, మహిళలను వేధిస్తే ఫోక్సో కేసు నమోదు చేస్తాం
----- నారాయణపేట జిల్లా షీ టీం పోలీసులు.
నమస్తే భారత్ / మద్దూరు, (జూన్ 20) :
నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు శుక్రవారం
మద్దూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణపేట షీ టీం పోలీసులు ఫోక్సో చట్టం, షీ టీమ్స్, యంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రభావం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆడపిల్లలపై వేధింపులు మొదలగు విషయాలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఆడపిల్లలను, మహిళలను ఎవరైనా వేధిస్తే నారాయణపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712670398 కి సమాచారం ఇవ్వాలని లేదా వాట్సప్ రూపంలో మెసేజ్ కూడా చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చి పోయే సమయంలో ఎవరైనా వేదించిన, మానసికంగా, శారీరకంగా హింసించిన, బాధపెట్టిన అట్టి వ్యక్తుల సమాచారం తల్లిదండ్రులకు గాని, ఉపాధ్యాయులకు గాని లేదా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు నూతన చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. నూతన చట్టాలలో మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందని పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలని 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారిని ఎవరైనా వేధించిన లేదా హింసించిన ఫోక్సో కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే విద్యార్థులు చిన్నతనం నుండి శ్రద్ధతో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే తమ భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీ టీమ్ పోలీసులు చెన్నయ్య, జ్యోతి, కవిత మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
