ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
డాక్టర్ వి.విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్21' ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీసులో డాక్టర్ బి విజయలక్ష్మి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ బి విజయలక్ష్మి హెల్త్ స్టాప్ తో యోగా ఆసనాలు చేయించి, ప్రతి వ్యక్తి ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా దృఢపడుతారు అని తెలియజేశారు. ప్రతిరోజు ప్రతి మనిషి నడక నడవడం వలన, ధ్యానం చేయడం, ప్రాణాయం చేయడం, అలోమా ..విలోమా చేయడం వలన, మనిషి యొక్క ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా , జీవితం యొక్క లైఫ్ పొడిగించబడుతుంది అనీ తెలియజేశారు. అందువలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు శారీరక యోగాసములతో పాటు ధ్యానం కూడా చేయాలని తెలియజేశారు. తదుపరి హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వాకింగ్ చేస్తూ, యోగాసనాలు చేస్తూ, ధ్యానము తప్పకుండా చేయాలని తెలియజేశారు.యోగాసనులతోపాటు ప్రతి మనిషి 45 సంవత్సరములు దాటిన తర్వాత , తను తీసుకునే ఆహారపు అలవాటులను మార్చుకోవాలని తెలియజేశారు. 45 సంవత్సరముల తర్వాత మాంసాహారం తక్కువ చేసి శాఖాహారం ఎక్కువగా తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు బాగా తీసుకోవాలని జై.శ్రీనివాసులు చెప్పారు. శాకాహారము తీసుకుంటూ జీవన శైలిని మార్చుకున్నట్లయితే ప్రతి మనిషి ఎక్కువ కాలం జీవించవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు , హెల్త్ సూపర్వైజర్ అమృత, స్టాఫ్ నర్స్ వినీత, ఆసుపత్రి హెడ్నర్స్ మరియు స్టాప్ అన్వర్ , రవికుమార్, గౌస్, ఏఎన్ఎం సుందరి మరియు ఆశలు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

