నిస్వార్ధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్21:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్తెలంగాణ ఉద్యమ రథసారథి, నిస్వార్ధంగా రాష్ట్ర సాధన కోసం పనిచేసిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14 వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్ధంగా రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని వివరించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. జాతీయస్థాయిలో మహాత్మా గాంధీ ఎలానో తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ అలాగే జాతిపిత అయ్యారని వివరించారు. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారని అందుకు యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని వివరించారు. అందుకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బిజెపి పార్టీ సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు అందిన కాడికి దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకులను ఏనాటికి మరచిపోరాదని గుర్తు చేశారు. మహనీయుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
