నారాయణపేట జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరు

నారాయణపేట జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరు

 

----సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్.-----  సిపిఐ మద్దూరు మండల కార్యదర్శిగా వెంకటయ్య ఎన్నిక.

 నమస్తే భారత్ / మద్దూరు, (జూలై 01) : కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరుకు సిద్ధమవుతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.సంతోష్ అన్నారు. మద్దూరు మండల పరిధిలోని పల్లెర్ల  గ్రామంలో జరుగుతున్న భారత కమ్యూనిష్టు పార్టీ సిపిఐ మద్దూరు మండల ఆరో మహాసభలు పలు రకాల తీర్మానాలతో ముగిసాయి.
    ముగింపు సభలో యస్.సంతోష్ మాట్లాడుతూ;-నారాయణపేట జిల్లా రాష్ట్రానికి చివరి బార్డర్ లో అభివృద్ధికి నోచుకోకుండా విద్యా వైద్యం ఉపాధి రంగాలలో వెనుక పడటమే కాకుండా సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో కూడా తీవ్రమైన నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. జిల్లా పరిధిలో పుష్కలమైన సహజ వనరులు సారవంతమైన భూములు ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఫలాలు అందని ద్రాక్షల మారాయని అన్నారు. జయమ్మ చెరువు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడారిగా ప్రకటించి యువతకు ఉపాధి కల్పించాలని, గ్రామాలకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ మద్దూరు మండల మహాసభలో సిపిఐ ఉమ్మడి జిల్లా నేత పి సురేష్ సమక్షంలో సిపిఐ మద్దూరు మండల నూతన కార్యదర్శిగా వెంకటేష్(నంధిపాడు), సహాయ కార్యదర్శులుగా హాన్మంతు (అప్పిరెడ్డి పల్లి),వెంకటయ్య(లక్కయ పల్లి) సమితి సభ్యులుగా అంజలప్ప, గణేష్, నర్సింలు, ఆశప్ప, శ్రీశైలం, కాశప్ప, చెన్నయ్య, అమృతమ్మ లతో పాటు మరో ఇద్దరిని కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

''ఖ‌ర్గె" సభకు తరలిన మజీద్ పుర్ కాంగ్రెస్ శ్రేణులు ''ఖ‌ర్గె" సభకు తరలిన మజీద్ పుర్ కాంగ్రెస్ శ్రేణులు
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభకు మేడ్చల్ నియోజకవర్గ ఆలియాబాద్ మున్సిపల్ మజీద్ పూర్ నుండీ కాంగ్రెస్...
ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ సభకు భారీగా తరలిన ఆలియాబాద్ కాంగ్రెస్ శ్రేణులు
పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్