ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియం చదువు.
బొట్టుపెట్టిఆహ్వానిస్తున్న అంగన్వాడీ టీచర్ మహేశ్వరి
కొంగా గూడా తండాలో బడిబాట కార్యక్రమం.
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 11:ప్రైవేట్ పాఠశాలలకు వద్దు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించండి అని అంగన్వాడి టీచర్ మహేశ్వరి ఐ సి డి స్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఉదయ అన్నారు.బుధవారం నాడు ఫరూఖ్ నగర్ మండలంలోని కొంగ గూడ, తండాలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఐ సి డి ఎస్ ఉదయ, మాట్లాడుతూ.
విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రభుత్వ అంగన్వాడి కేంద్రం (సెంటర్లకు) (పాఠశాలలో) ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగుతుందని విశాలమైన తరగతి గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ధ ప్రభుత్వము ఉచిత పాఠ్యపుస్తకాలు రెండు జతల యూనిఫాం ఉచిత మధ్యాహ్న భోజనం మనోవికాసాభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు సౌకర్యం పుస్తకాలు ఇలా ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనతో పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేస్తుందని కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయల అప్పులు చేసుకొని ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ అంగన్వాడి కేంద్రం ,లు (సెంటర్లో)లో సైతం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులను బొట్టు పెట్టి పిల్లలను పంపమని విద్యార్థి తల్లిదండ్రులను కోరారు. కొంగ గూడ, తండాలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడి టీచర్ మహేశ్వరి హెల్పర్ విజయలక్ష్మి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు, ఆశా మదర్స్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

