క్యాబినెట్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన ప్రవీణ, పార్వతి
దళిత సంక్షేమం, మానవ హక్కుల పరిరక్షణకు మంత్రి సహకారం కోరిన కమిషన్ ప్రతినిధులు
నమస్తే భారత్ షాద్ నగర్ ,జూన్ 11:
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ శ్రీ ప్రవీణ, నేషనల్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పార్వతి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశంలో పార్వతీ మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలవ్వాలి. యువ దళితులకు ఉపాధి, విద్య, సామాజిక హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. దళిత సేన ఇప్పటికే గ్రామీణ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తోంది. మంత్రివర్యులు ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలి," అని విజ్ఞప్తి చేశారు.ప్రవీణ మాట్లాడుతూ, "మానవ హక్కులు, సామాజిక న్యాయ పరిరక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఎటువంటి పక్షపాతమూ లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలా చూడటం నేషనల్ కమిషన్ కట్టుబాటైన విధి. మంత్రి ప్రజా సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధత అభినందనీయం," అని అన్నారు.ఈ సమావేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మంత్రిని కలిసిన వారిలో రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి శ్రీమతి సరస్వతి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు తదితరులు ఈ సందర్భంగా మంత్రి వివేక్ కూడా కమిషన్ ప్రతినిధులకు పూర్తిగా సహకారం అందించేందుకు హామీ ఇచ్చారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

