కాంగ్రేస్ ప్రభుత్వం చంద్రుడి మీద మచ్చ చూపించే ప్రయత్నం.....
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు
తెలిపిన
రాజేంద్రనగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
నమస్తే భారత్ ప్రతినిధి రాజేంద్రనగర్, జూన్ 11, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్ రావు (కెసిఆర్)కాళేశ్వరం కమిషన్ పి.సి.ఘోష్ ఎదుట విచారణకు హాజరు అవ్వడానికి బి ఆర్ కె భవన్ వస్తున్నందున రాజేంద్రనగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆదేశాలతో రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి డివిజన్ నుండి అధ్యక్షులు ఎస్. వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న తరలి వెళ్లడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన పేద రైతులకోసం అహర్నిశలు శ్రమించి అతి తక్కువ కాలములో ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఏకైక ప్రజల ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ నేషనల్ మీడియా సైతం కొనియాడిన నిజాన్ని జీర్ణించుకోలేని కాంగ్రేస్ ప్రభుత్వం చంద్రుడి మీద మచ్చ చూపించే ప్రయత్నం చేస్తుంది దానిని బద్ధలు కొట్టుకొని నిజాలను నిర్భయంగా కమిషన్ కు పూర్తి వివరాలను వివరించడానికి ధైర్యంగా వచ్చిన కెసిఆర్ కి స్వాగతం పలకడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము అని అధ్యక్షులు వెంకటేష్ వివరించారు. ఈ కారిక్రమానికి పెద్ద ఎత్తున్న పాల్గొన్న సుభాష్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, రాము యాదవ్, సోమ శ్రీనివాస్, రఘు యాదవ్, మైసిరెడ్డి, ఎడ్లకాడి సూర్యం, గుమ్మడి కుమార్, జి రాజు జగదీష్ ప్రవీణ్ భగవాన్ దాస్,దుర్గేష్, భూదేవి సరితా మహేష్, అశోక్, సునీల్ భాస్కర్, కార్తీక్ కిషోర్ ఎడ్లకాడి చంద్రశేకర్,బర్ల సుమన్,జనార్దన్,అరుణ్, సురేష్, మల్లేష్, రమేష్, రిషి రినార్డ్, మహమూద్, విజయ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

