ప్రజా కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి : ఎమ్మెల్యే పితాని
విధ్వంసం నుండి వికాసం వైపు కూటమి సుపరిపాలన
ఆచంట నియోజకవర్గం, నమస్తే భారత్:
ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనకు ఏడాది పూర్తయిందని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం ఉదయం పెనుగొండ మండలం వడలి నుండి రామన్నపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన తో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఏడాది కాలంలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు, బెడ్ రీడింగ్ రోగులకు పింఛన్లు పెంచి పంపిణీ చేశామని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదలకు పట్టేడు అన్నం పెట్టామని చెప్పారు. దీపం టు తల్లికి వందనం మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగ భర్తీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేశామన్నారు విధ్వంసం నుండి వికాసం వైపు కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సూపర్ ఫైన్ బియ్యాన్ని సరఫరా చేసి పిల్లలకు అన్నం పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజునే తల్లికి వందనం పేరట రాష్ట్రవ్యాప్తంగా 42 ,69,459 తల్లుల ఖాతాలో67,27,164 విద్యార్థులకు ఒక్కొక్కరికి 15000 రూపాయల చొప్పున తల్లికి వందనం సొమ్ము తెలిపారు. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు పంపిణీ ప్రారంభించామని అన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి నీటిని శుద్ధి చేసే పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి రంగా రాజు, స్థానిక సర్పంచ్ 1,50,000 నుండి 50వేల వరకు ఇళ్ల పట్టాలకు డబ్బులు వసూలు చేశారని చెప్పారు. అభివృద్ధి నిరోధక శక్తులను ఉపేక్షించేది లేదని వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పరిశీలికులు రుద్రరాజు వెంకటరామరాజు, సీనియర్ నాయకులు బడేటి బ్రహ్మాజీ, ఎంపీటీసీ ముకమట్ల కృష్ణ కాంత్, పెనుగొండ మండల అధ్యక్షులు గుత్తుల లోకేశ్వరరావు, కొండవీటి శ్రీనివాసరావు, దొడ్డిపట్ల నాగూర్ , పెరబత్తుల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు, పెనుమక రమేష్,ముత్యాల జానకి రామయ్య, పెనుగొండ తహసిల్దార్ అనిత కుమారి, ఎంపీడీవో మరియు గ్రామ ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
