50సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం పోరాడుతున్న సింగరేణి భూనిర్వాస్తులు..

50సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం పోరాడుతున్న సింగరేణి భూనిర్వాస్తులు..

 


కోర్టు తీర్పును అమలు చేయని ఆర్ డి ఓ...

దశల వారి పోరాటాలు నిర్వహిస్తాం..
సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మీడియం బాబురావు

నమస్తే భారత్: మణుగూరు


మణుగూరు12: 50 సంవత్సరాలు గా భూ నిర్వాసితులు తమకు న్యాయంచేయాలని పోరాటం నిర్వహిస్తున్నారని ఆర్ డి ఓ నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసితులను బెదిరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు గురువారం బండారి గూడెం భూ నిర్వాసితులు మీడియం బాబురావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియం బాబురావు భూ నిర్వాసితులతో మాట్లాడుతూ 1975 పైలట్ కాలనీ ముత్యాలమ్మ గుడి ప్రాంతంలో సింగరేణి లో భూములు కోల్పోయిన 52 ఎకరాలకు సంబంధించిన 22 కుటుంబాలు తక్కువ ప్యాకేజీ తీసుకోకుండా ఆనాడు తిరస్కరించారని అన్నారు. తదనంతరం 2011లో హైకోర్టును ఆశ్రయించారని అన్నారు 2023 న కోర్టు భూనిర్వాస్తులకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారి చేసిందన్నారు. భూములకు భూములు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పునిచ్చిందన్నారు. అందులో భాగంగానే ఆర్ డి ఓ స్థానిక తాసిల్దార్ 2023 లో వచ్చిన తీర్పు ఆధారంగా 34 ఎకరాలకు 8 కోట్లు పైగా డబ్బులు సింగరేణి ప్రభుత్వానికి చెల్లించిందన్నారు. ప్రభుత్వ అధికారులు తమకు కమిషన్ ఇస్తేనే ప్యాకేజీ ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించాలని భూనిర్వాసులకు ప్యాకేజీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో దశల వారి ఆందోళనలు పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, మణుగూరు మండల కార్యదర్శి సత్ర పల్లి  సాంబశివరావు,  జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు, సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు,. మాజీ సర్పంచ్ పాయం భద్రయ్య, పిట్టల నాగమణి, బండారు తిరుమలయ్య, కాంతయ్య, సోలం లక్ష్మీనారాయణ, కారం పెద పుల్లయ్య, బండారు సారిక, అధిక సంఖ్యలో భూ నిర్వాసితులు పాల్గొన్నారు

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వాల్గొండలో కరెంట్ షాక్… జూనియర్ లైన్ మెన్ మృతి వాల్గొండలో కరెంట్ షాక్… జూనియర్ లైన్ మెన్ మృతి
మల్లాపూర్‌ : విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ లైన్మెన్‌ దుంపేట రాజేశం ప్రమాదవశాత్తు విద్యుత్‌ పనులు చేస్తుండగా శనివారం విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం...
నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయ్‌
నేడు రమేష్‌ విశ్వాస్‌.. నాడు థాయ్‌ యాక్టర్‌‌.. ప్రాణాలు నిలిపిన 11A సీటు..!
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్
ప్రైవేట్‌ పాఠశాలల .. పుస్తకాలు, యూనిఫాంల దోపిడీని అరికట్టండి ..!
ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఎస్ ఎఫ్ ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ నాయకులు