క్యాన్సర్ పేషెంట్ కు వసుధ ఫౌండేషన్ రూ.10వేల ఆర్థిక సాయం అందజేత*
నరసాపురం నియోజకవర్గం, నమస్తే భారత్:
మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గుబ్బల విజయలక్ష్మి కుమారి గొంతు క్యాన్సర్ తో బాధపడుతోంది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలియడంతో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట్రామరాజు మానవతా హృదయంతో స్పందించారు. విజయలక్ష్మి కుమారికి వైద్య ఖర్చులకోసం రూ.10వేల ఆర్థిక సాయం పంపించారు. సంబంధిత చెక్కును గురువారం పాలకొల్లులో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ పెనుమత్స బుద్ధరాజు ఆయన ఇంటి వద్ద పేషంటు విజయలక్ష్మి కుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధరాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు . రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన సందర్భంగా వసుధ ఫౌండేషన్ కు, దాత వెంకట్రామరాజుకు పేషెంట్ విజయలక్ష్మి కుమారి, ఆమె భర్త కృతజ్ఞతలు తెలియజేశారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

