నాలుగు రోజుల్లో హాస్పిటల్ కు పరిష్కారం చూపకపోతే నారాయణపేట బంద్ చేస్తాం
---పాలకులకు ప్రజల ఉసురు తగులుతది
---జిల్లా కేంద్రంలో వైద్య సేవలు లేకపోవడం ఏమిటి
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
నారాయణపేట జిల్లా కేంద్రంలో వైద్య సేవలపరంగా వెంటనే నాలుగు రోజుల్లో పరిష్కారం చూపకపోతే పేట బంద్ చేపడతామని బిజెపి సీనియర్ నాయకులు నాగురావు నామాజీ అన్నారు. జిల్లా ఆస్పత్రిని అప్పక్ పల్లి కి మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ప్రజా వైద్యం కోసం ప్రజల పోరాటం అనే కార్యక్రమంతో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా పళ్ళ హనుమాన్ మందిరం నుంచి ర్యాలీని చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు నాగురావు మాట్లాడుతూ గతంలో ఆసుపత్రిని కట్టింది ఎవరో తెలుసుకోవాలన్నారు. వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంపై పేద ప్రజల ఉసురు పాలకులకు తగులుతుందని విమర్శించారు. ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో వైద్య సేవల కోసం 11 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏమిటంటే ప్రశ్నించారు. ఈ నిర్ణయం అధికార పార్టీ పాలకులకు కూడా మంచిది కాదన్నారు. గర్భిణీలకు, ప్రాథమిక సేవలను జిల్లా కేంద్రంలోని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నపిల్లల వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలన్నారు. అత్యవసర వైద్య సేవలను నిమిత్తం ఆర్టీసీ అంబులెన్స్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 60 వేల పైచిలుకు జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో బస్తీ దవఖానాలు లేకపోవడం ఏమిటని... రాత్రికి రాత్రే ఆసుపత్రిని షిఫ్ట్ చేయడం తగదన్నారు. నిరాహార దీక్షలో బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, రతంగ పాండు రెడ్డి, నందు నామాజీ, శ్రీనివాసులు, రఘురామయ్య గౌడ్, ఎల్ఐసి లక్ష్మి కాంత్, పోషల్ వినోద్, సత్య రఘుపాల్, లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్, కే . శ్రీను, మిర్చి వెంకటయ్య, జేఏసీ వెంకటయ్య, సాయిబన్న, కృష్ణ, నర్సింలు, మణిశంకర్, మని మోడీ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

