రెడ్డిగూడెం భూవివాదంలో ఎవరిని బెదిరించలేదు, తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భూములు వదిలేది లేదు

రెడ్డిగూడెం భూవివాదంలో ఎవరిని బెదిరించలేదు, తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భూములు వదిలేది లేదు

 


 తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి డి. పున్నoచంద్

 
నమస్తే భారత్: పాల్వంచ


పాల్వంచమండలం, పాండురంగాపురం రెవిన్యూ 126 సర్వేనెంబర్ భూముల విషయంలో సాగు చేసుకున్న ఆదివాసీలకు హక్కు లేదని, మాన్యువల్  నకిలీ పహానిలు చూపిస్తున్న వారికి భూములు చెందుతాయని పాల్వంచ రూరల్ పోలీసులు జడ్జిమెంట్ ఇచ్చి, 1/70 చట్టం, పెస ఏజెన్సీ ఆదివాసి  చట్టాలను కాలరాచి, ఆదివాసీలపై  కేసులు నమోదు చేసిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ రైతుకూలీ  సంఘం జిల్లా కార్యదర్శి డి పున్నo చంద్ పిలుపునిచ్చారు.
 గురువారం ఆదివాసి చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసులపై అక్రమ కేసులు పెడుతూ వారి భూముల్లోకి వారిని రానీయకుండా చేస్తున్న గిరిజనేతర భూ అక్రమార్కులైన ఏనుగు వెంకటరెడ్డి, రత్నారెడ్డి, సైదులు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని, ఆదివాసి, పేదల భూములకు రక్షణ కల్పించాలని, ఆదివాసులపై పెట్టిన తప్పుడు కేసులను సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో  బుధవారం  పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిరసన తెలిపి తహసిల్దార్ కు  వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పున్నo చంద్ మాట్లాడుతూ.. సుమారు గత రెండు దశాబ్దాల నుండి మోర రవి నాయకత్వంలో పాల్వంచ మండలం తో పాటు సరిహద్దు మండల గ్రామాల చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజన, గిరిజనేతర పేదలు 167 మంది ఎవరి ఆధీనంలో లేని 126 సర్వేనెంబర్ రెవెన్యూ  భూముల్లో చెట్లు తుప్పలు పొదలు శుభ్రం చేసుకుని సాగు చేశారు. సాగు చేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుటకు సారపాకకు చెందిన ఏనుగు వెంకట్ రెడ్డి, గొల్లమారి రత్నారెడ్డి, ఎస్కే సైదులు ఆధ్వర్యంలో స్థానిక ఉపసర్పంచ్ గా ఉన్న కళ్లెం వెంకటరెడ్డినీ కలుపుకొని బయట నుండి కొంతమంది రౌడీషీటర్లను, గుండాలను తీసుకొచ్చి ఆ భూముల్లో సాగులో ఉన్న ఆదివాసి గిరిజనులపై , రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గిరిజనేతర పేదలపై దాడి చేసి, వారికి నాయకత్వం వహించిన మోర రవి పై విచక్షణారహితంగా దాడి చేసి చనిపోయాడని చెట్లపొదల్లో విసిరేసి వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ ప్రజలు ఆ భూములను వదిలిపెట్టకుండా సాగులో ఉన్నారు. కొంతకాలం క్రితం ఏనుగు వెంకట్ రెడ్డి ముఠా మోర రవితో మాట్లాడి ఇక్కడి ప్రజలతో రాజీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాక, తీవ్రంగా పోరాడి సాధించుకున్న ఆ భూములను క్రమ, క్రమంగా ఆక్రమించుటకూ, రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేయించుకొనుటకు ప్రయత్నిస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన గిరిజనేతర పేదలతో పాటు, ఆదివాసి గిరిజనులపై, వారికి నాయకత్వం వహించిన మోర రవి పై పదేపదే తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించుటకు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే సూర్యపేట నుండి వలస వచ్చిన, బూర్గంపాడు మండలం సారపాక నుండి వచ్చిన వారు ఆ భూములు కొనుక్కున్నారని,10 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినట్టు, భూములు వారికే చెందుతాయని వక్రీకరిస్తూ, ఆదివాసి గిరిజనులను బెదిరించడమే కాక, ఆదివాసి చట్టాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆదివాసీలపై  తప్పుడు కేసులు బనాయిస్తున్న పద్ధతిని  తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కష్టపడి సాగు చేసుకున్న సమీప గ్రామాల ఆదివాసులను స్థానికులు కాదని మాట్లాడుతున్నారని, ఏజెన్సీలో గిరిజనేతరులైన సారపాక వారికి, సూర్యాపేట వారికి హక్కులు ఉంటాయా అని ప్రశ్నించారు. పాల్వంచ మండలంలోని గ్రామాలతోపాటు, ఈ భూములకు చుట్టూ ఉన్న సరిహద్దు మండలాలు బూర్గంపాడు, అశ్వాపురం మండలాలకు చెందిన శివారు గ్రామాల వారు కూడా మొదట నుండి భూముల వద్ద మకాం వేసి సంవత్సరాల తరబడి శుభ్రం చేశారు. ఆదివాసీలైన వీరికి ఇక్కడ ఎలాంటి హక్కులు లేవని పోలీసు వారు కేసులు పెట్టి, తీర్పు కూడా ఇచ్చారు. ఏజెన్సీ ఆదివాసి చట్టాలను కాపాడాల్సిన పోలీసులే చట్టాలను ఉల్లంఘించి తిరిగి ఆదివాసీలపైనే కేసులు పెట్టడాన్ని ప్రశ్నించారు. భూములు ఎవరివి అనేది రెవెన్యూ వారు తేల్చాలి. లేదా కోర్టులో తేలాలి. అంతేకానీ రెవిన్యూ వారు కంప్లైంట్ చేయకుండా, కోర్టు ద్వారా తేల్చకుండా, భూమి దగ్గర అసలు ఘర్షణ జరగనప్పుడు, వారు చూపించిన నకిలీ మాన్యువల్ పహనీలను ఆధారంగా, వారు ఇచ్చిన తప్పుడు కంప్లైంట్ పేర్కొన్నట్లు వారు భూమి దగ్గరికే రానప్పుడు బెదిరించారని కేసులు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. ఏనుగు వెంకటరెడ్డి ముఠా చెపుతున్నట్లుగా వారు భూములు ఎవరి దగ్గర కొన్నారో అమ్మిన వారిని తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసు వారు తప్పుడు కంప్లైంట్ పై ఆధారపడి తప్పుడు కేసులు బనాయించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? అని ప్రశ్నించారు. అబద్దాల పునాదులపై ఏనుగు వెంకట్ రెడ్డి ముఠా అల్లుతున్న కట్టు కథలు, పిట్టకథలు వారి అనుయాయులు నమ్ముతారేమో కానీ, రెడ్డిగూడెం భూపోరాటం, దాని చరిత్ర, వాస్తవాలు జిల్లా ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. ఏనుగు వెంకటరెడ్డి ముఠా వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా ప్రజలపై దౌర్జన్యం చేసి భూములు ఆక్రమించాలనుకుంటే ప్రజలు చట్టబద్ధంగా, న్యాయపరంగా  పోరాడి ఓడిస్తారనే విషయాన్ని గుర్తించాలని, ఇప్పటికైనా సమస్య పూర్వపరాలు యదార్థాలపై ఆధారపడి  చర్చించుకుని, పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కుంజా వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీసంఘటన జిల్లా కార్యదర్శి తోలేం మమత, అధ్యక్షురాలు సోమక్క, గోపమ్మ, దండి కొమరయ్య, కారం నరసింహారావు, బండ రాంబాబు, భద్రయ్య, సూరమ్మ, సూర్యం తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు
వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ఆ వరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని...
బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు..
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లితో కలిసి తండ్రిని చంపిన కూతురు
మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.
ఇజ్రాయెల్‌ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
వెదజల్లే పద్దతితో అధిక దిగుబడి