ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
* విద్యార్థులకు సకల సౌకర్యాలు
* ఉచిత భోజనం దుస్తులు పంపిణీ
* విద్యాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి
* ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఆచార్య మద్దెల శివకుమార్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలలోనే చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ పాఠశాల సిబ్బంది కలిసి గ్రామమంతా తిరిగి తల్లిదండ్రులను మోటివేట్ చేస్తూ
ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించారు. వారందరిని ప్రభుత్వ బడిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు తరగతుల పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని భావిస్తున్న తల్లిదండ్రులను గుర్తించి వారి గృహాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో ఫీజులు అధిక దోపిడి తీరును వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారధ్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి గా పరుగులు తీస్తున్నదని పేర్కొన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో అన్ని మౌలిక వసతుల రూపకల్పనతోపాటు ఉదయం పూట పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఉచిత యూనిఫాం ఆంగ్ల భాషలోనే బోధన తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందన్నారు. పేద ప్రజలందరికీ ఉత్తమ విద్యను అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నదని అందువలన బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, అంగన్వాడీ టీచర్ ప్రమీల, పాఠశాల వంట ఏజెన్సీ రజిత, తల్లిదండ్రులు ప్రియాంక, లక్ష్మి, శ్రీనివాస్, శంకర్, గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

