దివ్యాంగులకు జీవో 89 విడుదల కాంగ్రెస్ పుణ్యమే వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
40% వైకల్యం కలిగిన దివ్యాంగులకు చదువుతో సంబంధం లేకుండా వారి వారి అవసరాన్ని బట్టి ఉచితంగా పరికరాలు ఇవ్వాలని గత పది సంవత్సరాల నుండి వికలాంగుల సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేసిన అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం చేత లక్షలాది మంది దివ్యాంగులు పరికరాలు అందక నానా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్పడింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలలో భాగంగా అందులో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వాటిలో జీవో 89 ని అమలు చేయడం కొరకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు కొరకు ఎంతో కృషి చేశారు. ఈ జీవో అమలు కావడం వల్ల తొమ్మిది రకాల దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పొందే అవకాశం కలిగిందని నగేష్ గౌడ్ అన్నారు.ఈ ఉచిత పరికరాల కొరకు 40% వైకల్యం ఉన్న ప్రతి దివ్యంగునికి ఈ సహాయ పరికరాలు అందుతాయని ఆయన అన్నారు. జీవో 89 అమలుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క కి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క కి కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారికి ఆయన కృతజ్ఞతలు .
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

