చంద్రశేఖర్ ఆజాద్ యువతకు ఆదర్శం
ఉట్కూర్ మండలం/ నమస్తే భారత్
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. యువ కెరటం చంద్రశేఖర్ ఆజాద్ జూలై 23 జయంతి సందర్భంగా ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆజాద్ చంద్రశేఖర్ విగ్రహానికి పివైఎల్, పిడిఎస్ యు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు, గోవర్ధన్ రెడ్డి, పిడిఎస్ యు ఆకాష్ రవితేజ గ్రామ యువకులు నివాళులర్పించారు.పివైఎల్ జిల్లా కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ, 1906 జూలై 23న సీతారాం జగరాణి దేవి గార్లకు జన్మించిన భరతమాత ముద్దుబిడ్డ తన 24 సంవత్సరాల వయసులోనే దేశ స్వతంత్రం స్వేచ్ఛ కోరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1919 జలియన్వాలాబాగ్ దూరంగతం ఎంతోమంది యువతలను దేశం కోసం, హెచ్ఎస్ఆర్ఏ చేరి భగత్ సింగ్, ఆజాద్, రాజగురు సుకుదేవ్, పోరాట యువతతో కలిసి పనిచేసే మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రత్యక్షంగా బ్రిటిష్ సైన్యాన్ని మట్టుపెట్టేందుకు పోరాటం చేయాలని ముందున్నాడు. 15ఏళ్ల వయసులోనే వారికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారు ఆయనను అరెస్ట్ చేసి చెడులో నిర్బంధించారు. అయినా అదరక బెదరక కోర్టు జడ్జి ముందు నీ పేరేంటి అంటే ఆజాద్ అన్నాడు. స్వతంత్రం ఇంటిపేరు జైలు అన్నాడు బ్రిటిష్ వారికి లొంగకుండా యుద్ధం చేయాలన్నదే ఆయన ఉద్దేశం అందుకే హోరా హోరిగా పోరాడి అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్కులో తన దగ్గర ఉన్న తుపాకితో ఆఖరి బుల్లెట్ వరకు పోరాడారు. బ్రిటిష్ వారి చేతిలో చావకూడదని భావించి తన తుపాకీతో కాల్చుకొని ఆత్మబలిదానం గావించాడు. ధైర్యం సాహసం, మహోన్నత దేశభక్తి త్యాగం, ఆయన నైజం, ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవలసిన ఎంతైనా ఉందని విద్యార్థి యువకులు దేశభక్తి విలువలను , ఉద్బోధించారు. ఆజాద్ దేశ స్వతంత్ర స్వేచ్ఛని కాదు దేశ ప్రజలకు దోపిడి పీడన లేని సమ సమాజం సామాజిక న్యాయం కోసం పరితపించాడు. దేశ ప్రజలు దీనికోసం పోరాడు సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిడియస్ యు కొల్లూరు అరుణ్, జట్రం శీను, వెంకటేష్ రైతు సంఘం నాయకులు మల్లేష్ పొర్ల, నరసింహ, రవి, ఆంజనేయులు, పరుశురాం, రాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

