కోరమోని హరి భూషణ్ పటేల్ పరిచయం
రైతు కుటుంబం నుంచి దేశ సేవకుడి దాకా
ఒక శ్రద్ధగల కార్యకర్త జీవన యాత్ర
నమస్తే భరత్ షాద్ నగర్ జులై28:కోరమోని హరి భూషణ్ పటేల్ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, అసాధారణ వ్యక్తిత్వాన్ని సంపాదించిన ఘనతకు అధికారి. చిన్ననాటి నుంచే శ్రమ, నిబద్ధత, దేశభక్తి ఆయన జీవనంలో భాగమయ్యాయి. బాల్యంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) స్వయంసేవకునిగా దేశాభిమానం గల యువకుడిగా తొలి అడుగులు వేశారు.విద్యార్థిగా ఉన్నపుడే ఆయన శారీరక పరిపక్వత, ఆత్మనియంత్రణ, నిరంతర సాధనకు ప్రాతినిధ్యం వహించే “న్యూ మాంక్స్ కుంగ్ ఫు” అనే చైనీస్ మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. దేశ భద్రత కోసం తన జీవితం అంకితం చేస్తూ భారత సైన్యంలో గౌరవంతో సేవలందించారు. దేశ రక్షణలో భాగమైన అనుభవం ఆయనలో ఉన్న పటుత్వాన్ని, శాస్త్రీయ క్రమశిక్షణను మరింత పెంపొందించింది.భారత సైన్యంలో ఆయన విభిన్న మైనటువంటి రంగాలలో ప్రత్యేక శిక్షణలు, యుద్ధ నైపుణ్యాలు, ఆపరేషనల్ ట్రైనింగ్‌లు, సరిహద్దుల రక్షణపై ఉక్కుసంఘాలు వంటి విభాగాల్లో అత్యున్నత శిక్షణలను పొందారు. ఆయన సైనిక జీవితంలో పలు ఉద్యమాలు, ఆపరేషన్లు, అంతర్రాష్ట్ర సేవలలో విశేష విజయాలు సాధించారు. ఈ సేవల ఫలితంగా ఆయన్ని గౌరవిస్తూ అనేక మెడల్స్, పారితుషికాలు, అభినందనలు, సైనిక అధికారుల ప్రశంసలు, ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. వీటన్నీ ఆయన సైనిక జీవితాన్ని భారత దేశ గర్వకారణంగా నిలబెట్టాయి.
సైనిక సేవ అనంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజాసేవలో అడుగుపెట్టిన భూషణ్ పటేల్ గారు పార్టీకి నిస్వార్థంగా అంకితమై, కార్యకర్తగా సాగిన జీవనయాత్రలో ఎన్నో ఉద్యమాల్లో భాగమయ్యారు. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి శక్తి, ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు.
కరోనా విపత్తులో ప్రతి ఒక్కరికి భరోసాగా నిలబడి, పేదలకు అన్నదానం, ఔషధ పంపిణీ, ఆక్సిజన్ లభ్యత కోసం పోరాటం చేశారు. ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, సేవా మార్గంలో ముందుండి నడిపించారు. ఆయన సేవలు గుర్తించి అనేకమంది మానవతావాదులు మెచ్చుకున్నారు.
ఆయన జీవితం దైవారాధన, సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మికత, సేవా భావన లపై నిలబడిన సజీవ ఉదాహరణ. నిత్యం దైవచింతన చేస్తూ, నైతిక విలువలతో జీవితాన్ని గడుపుతూ, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా తన కృషిని అర్పిస్తున్నారు.కార్యకర్తలకు అండగా, ప్రజలకు స్నేహితుడిగా, పార్టీకి స్థాయిగా, సమాజానికి మార్గదర్శిగా, ప్రత్యర్థులకు గుండెల్లో గుబురు పుట్టించే ధీశాలి నాయకుడిగా, ఆయన నిరంతరం పని చేస్తున్నారు.
అలుపెరుగని శ్రమ, నిష్కల్మషమైన సేవా ధ్యేయం, రాజకీయం లో నైతికతను నిలబెట్టే పటుత్వం
పార్టీ విజయాన్ని ధ్యేయంగా మార్చుకున్న రణరంగ వీరుడు –
ఇలాంటి అన్ని పాత్రల్ని ఒక్క హరి భూషణ్ పటేల్ జీవితం ద్వారా పోషిస్తున్నారు.“జీవితం మోదీ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, భారతీయ జనతా పార్టీ కోసం” అన్న మాటను ఆయన నిత్యం తన సేవా చర్యలతో సత్యం చేస్తూ, సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

