మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: ఎంపీడీవో మంగాకుమారి
* కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే శరణ్యం
* మొక్కలే జీవకోటికి ప్రాణాధారం
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న మొక్కల పెంపకం అభినందనీయం
* కవిటంలో మొక్కలు నాటిన ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, కూటమి నాయకులు
* ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చెరువు గట్లపై 252 కొబ్బరి చెట్లు, రహదారికి ఇరువైపులా 600 కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం
నమస్తే భారత్ న్యూస్, పోడూరు, జూలై -9:
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు అవసరమని పోడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపీడీవో) బిఎస్ఎల్ మంగాకుమారి అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మాసివ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు సమక్షంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మంగాకుమారి మాట్లాడుతూ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలం 8.48 ఎకరాలకు 1,246 పండ్ల మొక్కలు, 3.80 ఎకరాల పంచాయతీ చెరువుల గట్లపై 262 కొబ్బరి మొక్కలు, రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర 600 మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ పథకంలో 3 సంవత్సరాల పాటు పెట్టుబడి ఖర్చు సొమ్ము రైతుకు చెల్లించడం జరుగుతుంది అన్నారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. వాతావరణ కాలుష్యంతో ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు సంభవిస్తున్నాయి అన్నారు. వాటి నియంత్రణకు మొక్కల పెంపకమే శరణ్యం అన్నారు. సకల జీవకోటికి మొక్కరే ప్రాణాధారమని, ప్రాణవాయువును విడుదల చేసి మనుషులు విడుదల చేసిన కార్బన్డయాక్సైడ్ని గ్రహిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి పోతంశెట్టి సూర్యనారాయణరెడ్డి, బూరాబత్తుల దుర్గాప్రసాద్, మండల ఉపాధి అదనపు అధికారి కె బాబూరావు, పంచాయితీ కార్యదర్శి కృష్ణవేణి, టిడిపి సీనియర్ నాయకులు మేడపాటి గంగాధర రెడ్డి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు గుబ్బల అప్పన్న స్వామి, ప్రధాన కార్యదర్శి ఊడిగ శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ బి.సునీల్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
