జీవో నెంబర్ 3 తో రైతు కూలీలకు ఉపాధి..
కలెక్టర్ గారు కరుణ చూ...! మా పట్టా భూములలో ఇసుక క్వారీకి అనుమతి ఇవ్వగలరునమస్తే భారత్: మణుగూరభద్రాద్రి మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని బూర్గంపాడు మణుగూరు పినపాక మండలాలలో1986 గోదావరి ప్రవాహం సుమారు 500ల ఎకరాలు పంట పొలాలు గోదావరి నీటిలో మునిగిపోయాయి, సాగు చేసుకోవటానికి వీలుకాక ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఏర్పడింది, గోదావరిలంక పట్టా భూములలో ఇసుక మేటలు తొలగించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 రూపొందించింది, దీనితో సుమారు 2015 నుండి 2024 వరకు సుమారు 150 ఎకరాలో ఇసుక మేటలు తొలగించిన భూములలో ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలలో , పుచ్చకాయలు, మినుము, పెసర పంటలను సాగు చేస్తే, సుమారు సంవత్సరానికి 30 వేల రూపాయలు చొప్పున దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు, జిఓ నెంబర్ 3 ఉపాధి గోదావరిలంక పట్టా భూములకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ద్వారా ఇసుక మేటలు తొలగించుటకు అనుమతి కలిపిస్తే డిసెంబర్ నెల నుండి జూన్ వరకు సుమారు 6 నెలపాటు రైతు కూలీలకు ఉపాధి దొరుకుతుందని వారు అన్నారు, చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలలో సుమారు 500 మంది రైతు కూలీలు లంక పట్టా భూముల్లో ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తే లారీల పట్టాలు కడుతూ ఒకరికి రోజుకు సుమారు 1000రూపాయల నుండి 1500 రూపాయలు ఆదాయం వస్తుందని సుమారు 500 మంది కుటుంబాలు ఆరు నెలలపాటి ఆదాయంతో బతుకుతున్నామని రైతు కూలీలు తెలిపారు. అటు వ్యవసాయం సరైన పంటలు పండక లేకపోవటంతో, చాలీచాలని జీవనం గడుపుతున్నామని పంట సరిగా దిగుబడి రాక, చాలా వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారు కరుణ చూపండి ...గోదావరి లంక పట్టా భూములు ఇసుక మేటర్ తొలగించుటకు ప్రభుత్వ అనుమతి ఇస్తే500 నుండి 1000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని, మాతోపాటు లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు ,ట్రాక్టర్ డ్రైవర్లు, గిరిజన కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని గోదావరి లంక పట్టాలలో సాగు చేయలేక తీవ్ర నష్టపోయామని, మా పట్టా భూములలో ఇసుక మేటలు తొలగించుటకు జీవో 3 2015 ప్రకారం అనుమతి ఇవ్వాలని, రైతులు పై రైతు కూలీలపై కలెక్టర్ గారు కరుణచూపాలని రైతంగం కోరుతున్నారు. ఇసుక క్వారీలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయo
ఇసుక క్వారీ వల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని దానిలో పట్టా భూమిలో తొలగించినందుకు ప్రభుత్వం ద్వారా ఒక క్యూబిక్ మీటర్ కి వంద రూపాయలు పట్టా భూమి రైతులకు ఇస్తారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యూబిక్ మీటర్ 650 రూపాయలు చొప్పున వినియోగదారులకు అమ్ముతుందని ప్రభుత్వం సుమారు 4లక్షల క్యూబిక్ మీటర్ అనుమతి ఇస్తే 4 లక్షలు 650 చొప్పున 26 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గిరిజనులు గిరిజన నేతలు తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం గోదావరి లంక పట్టా భూములలో ఇసుక మేటలు తొలగించిన అనుమతి ఇస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, రైతులకు రైతు కూలీలకు గిరిజన కుటుంబాలకు లబ్ధి కూర్చుందని ఆర్థికంగా బలపడతారని ఆర్థిక విశ్లేషకులు విద్యావంతులు చెప్తున్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

