మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం

మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

----- ప్రభుత్వ పథకాలు మహిళల పేర్లతో అమలు.
------- పేట, మక్తల్  నాకు రెండు కళ్ళు.
---- రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.

మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వం లక్ష్యమని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్నీ (గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీముబాకర్) మహిళల పేర్లతోనే అమలు చేస్తున్నారని  రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు, ఊర్లు, జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి దోహదం అవుతాయన్నారు. ఒక పెద్ద కుటుంబంలో ఎప్పటికైనా అన్నదమ్ములు భాగ పరిష్కారం చేసుకున్నట్లే  ఉమ్మడి మక్తల్ నియోజకవర్గంలో ఉన్న మక్తల్, నారాయణ పేట 2009 లో  విడిపోయి రెండు నియోజకవర్గాలుగా ఏర్పాటు అయ్యాయని, అయినా మక్తల్, నారాయణపేట వేరు కాదని, నారాయణపేట, మక్తల్  తనకు రెండు కళ్ళు అని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రానికి మంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన ఆయన ఇక్కడి 
ఎస్.ఆర్.( పోలేపల్లి ఫంక్షన్ హాల్ ) గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన  కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి తో కలిసి నారాయణ పేట మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ...  రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రగతికి పెద్దపీట వేసిందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ  కొన్నేళ్ళ కల అని, ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఉండాలని, అందులో రేషన్ కార్డులు అనేవి చాలా చిన్నదని, రేషన్ కార్డులు లేక, కొత్త పేర్లు నమోదు కాక నిరుపేదలు సతమతమైనా పదేళ్ళలో గత  ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కానీ మీరు ఓట్లు వేసి గెలిపించిన, మీరు ఎనుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో  కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ వచ్చాయన్నారు. నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి  డాక్టరై , తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక అయిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి, తాను ముందు నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నామని, ఈ రోజు తాను, డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి  ఇక్కడ మాట్లాడటానికి కారణం ప్రజలే అన్నారు. మేము ఎప్పుడూ మీ సేవకులమే అని అన్నారు. తాను సామాన్యమైన జీవితాన్నే గడపాలని కోరుకుంటానని  మంత్రి చెప్పారు. పవర్ పోతే ఈ హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవని అన్నారు. తమ ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే కానీ తమ ప్రభుత్వం వరి అంటే ఉరి కాదని సిరి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర 2350 ఇవ్వడంతో పాటు సన్న రకం వరికి క్వింటాకు అదనంగా 500 బోనస్ ఇస్తోందన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన వరిని బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఇక్కడే బియ్యం చేసి పౌరసరఫరాల శాఖ చౌక ధర దుకాణాల ద్వారా నిరుపేదలకు ఒకరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ ఘనత ప్రజా ప్రభుత్వాని కే దక్కుతుందన్నారు. అప్పట్లో ఏ దసరా ఉగాది దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పండగలకు మాత్రమే పేదల ఇంట్లో సోనా అన్నం తినే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి నిరుపేద ఆకలిని సన్న బియ్యంతో వండిన అన్నంతో తీరుస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణంపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు గౌరవం వద్దా? వంద రూపాయలకు మహిళలు చేయి చాచాలా అని అన్నారు.  200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తూ ఆ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ప్రతిపక్షాల కు వేరే పని లేదని, ఇటీవలే మాజీ మంత్రి ,మాజీ ఎమ్మెల్యేలు జూరాల డ్యాం కూలిపోతుందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తప్పుదోవ పట్టించారని, కానీ నిజానికి 2009 లో 11 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తేనే డ్యాం చెక్కుచెదరలేదని, కేవలం లక్ష క్యూసెక్కుల నీటికే కూలిపోతోందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడానికి మంత్రి తప్పు పట్టారు. గతంలో వ్యవసాయ పెట్టుబడికి అప్పులు చేసేవారని, ఇప్పుడు రైతులకు ప్రభుత్వం 250 కోట్ల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. ఈ 18 నెలల్లో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి  చేశావని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డిని అడిగితే పెద్ద జాబితా రాసి ఇచ్చిందని చెప్పారు. పూర్తిగా గుట్టల ప్రాంతమైన నారాయణ పేట పచ్చగా ఉండాలని ఈ జిల్లా వాసి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో జీవో 69 ద్వారా 4500 కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని, రాబోయే కాలంలో నారాయణపేట మరో తూర్పు, పశ్చిమ గోదావరి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నారాయణపేట ప్రగతి పథంలో నడుస్తోందన్నారు.  కానీ ఈ ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రతిపక్షం అడ్డుకుంటుందని, మక్తల్ నుంచి నీళ్లు వెళ్లే ఊరుకోమని ప్రకటనలు చేస్తున్నారని, ఆ మాటకొస్తే ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీళ్లు వదలక పోతే మన పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దాదాపు లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ఎత్తిపోతల పథకం వేరే ఎవరు సీఎం అయినా సాధ్యం అయ్యేది కాదని ఆయన తెలిపారు. ఇదో బృహత్తరమైన ఆలోచన అని మనం సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలపాలి అన్నారు. ముఖ్యంగా మక్తల్ నారాయణపేట కోడంగల్ ప్రజలు ఆలోచించాలి అన్నారు. ప్రతిపక్షాలు నిజం తెలుసుకోవాలని, ఒకరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడవద్దన్నారు. ఈ మధ్య సీఎం, మంత్రులను తిట్టడం వారికి చాలా సులువు అయిందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ అంటూ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను 175 కోట్లతో  పార్టీలకు అతీతంగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిర్మించి ఇస్తున్నామన్నారు. నారాయణ పేట నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 మంజూరు చేశామని, వీటిని తొందరగా పూర్తిచేస్తే అదనంగా మరో 3500 ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత తనది అని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను ఇప్పించే బాధ్యత తనది అన్నారు. రూ.200 కోట్లతో నారాయణపేట కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందని చెప్పారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఎంసీ హెచ్ వచ్చాయని, రాష్ట్రంలోనే  మహిళలకు ఇచ్చిన మొదటి పెట్రోల్ పంపు నారాయణపేట లోనే ఉందన్నారు. 18 నెలలో ఈ నియోజకవర్గానికి ఎన్నో సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయన్నారు. 160 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పం తీసుకున్నదని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బాగుంట తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించేందుకు తల్లులు తాపత్రయ పడతారన్నారు. తాను మంత్రి అయ్యాక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి ఫోన్ చేసి అభివృద్ధి పనులు అడిగిందని, తాను మాత్రం తన ఛాంబర్ లో తన పక్కనే  కుర్చీ వేసుకుని కూర్చోమని చెప్పానని, తాతా నర్సిరెడ్డి పేరు నిలబెట్టాలని ఆయన ఎమ్మెల్యే కు సూచించారు. తాను తిరిగిన ఊరు ఇదని,ఇక్కడి గొడుగు గేరిలోని అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంట్లో ఉన్నానని, మక్తల్ లో సినిమా టాకీస్ లేని సమయంలో సైకిల్ పై నారాయణ పేటకు వచ్చి  ఇక్కడి బాలాజీ టాకీస్ లో సినిమా చూశానని ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి తన చిన్ననాటి, కళాశాల నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నారాయణపేట కు న్యాయం చేయడం తన ధర్మం అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందని, కొత్త కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అర్హులైన వారు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు వస్తాయని తెలిపారు. సీఎం ఏప్రిల్ నెలలో ప్రారంభించిన సన్న బియ్యం కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం , బిల్లుల చెల్లింపు వేగంగా కొనసాగుతోందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ.పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి తన నాన్న చిట్టెం వెంకటేశ్వర రెడ్డి కి  మంత్రి వాకిటి శ్రీహరి తో మంచి సత్సంబంధాలు ఉండేవని తెలిపారు. ఈ రోజు మంత్రి పదవిలో బాబాయ్ శ్రీహరిని చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. తన శాఖల్లో ఏం అవసరం ఉన్నా , ఏం అడిగినా నారాయణపేటకు ఇవ్వాలని  ఆమె కోరారు. నిరుపేదల ఎన్నో ఏళ్ల రేషన్ కార్డులు కల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని, కొత్త కార్డుల అందుకున్న వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎన్నికల ప్రచారంలో తిరిగే సమయంలో చాలా మంది రేషన్ కార్డులు, ఇండ్ల గురించే అడిగారని, ఈ ప్రభుత్వంలో ఆ రెండింటితో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వచ్చిన 3500 ఇండ్లలో ఒక్క నారాయణ పేట కే 900 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వచ్చిన వాటి గురించి ఎవ్వరూ చెప్పరని,రాని వాటి గురించే చెప్తారన్నారు. తాను సేవకురాలిగా పని చేసి వచ్చే మూడేళ్ల లో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్ , మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతు కుమార్,సివిల్ సప్లై అధికారి బాలరాజు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు
,,,,నమస్తే భరత్,,,29/7/2025/,నారాయణపేట జిల్లా,,,మండలం లోని బైరంకొండ గ్రామంలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు మాజీ సర్పంచులు సాయిబన్న, రామకృష్ణ శివప్ప గ్రామ యువకులు...
మూల మర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం.
పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!
ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:
నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:
కోస్గి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్