10 ఏండ్లలో రేషన్ కార్డులు ఇవ్వని బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి సీతక్క
నమస్తే భరత్ జూలై 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మరియు జిల్లా ఇంచార్జిమంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి కళ్యాణ మండపంలో దోమకొండ, బీబీపెట్ మండలాల్లోని లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ మరియు అదనపు సభ్యుల చేర్పు లేఖలను రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మరియు జిల్లా ఇంచార్జిమంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మరియు ప్రభుత్వ సలహాదారు ( ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ సంక్షేమం) షబ్బీర్ అలీ లబ్ధిదారులకు అందచేశారు.
ఈ సందర్భంగా దోమకొండ మండలంలోని 352 మంది లబ్ధిదారులకు, బీబీపేట్ మండంలోని 555 మంది లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ మరియు అదనపు సభ్యుల చేర్పు లేఖల పంపిణీ చేశారు.
జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు పేద వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందించిందని, తిరిగి ఈ రోజు పంపిణీ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా ఇంట్లో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఒక్క బియ్యం కొరకు పెట్టే ఖర్చు ఎంత తగ్గుతుందో ఒక సారి ఆలోచించుకోవాలని అన్నారు. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని. మూడు నెలలకు సరిపడా సరుకులు ముందస్తు గానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, వడ్డీలేని రుణాలు అన్ని కేవలం మహిళల పేరిట మాత్రమే ఇవ్వడం జరుగుతుందని. మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందని భావించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటగా చేతిలో చిల్లీ గవ్వ లేక పోయిన చదువుకోడానికి, పనులకు వెళ్లే అడ కూతుళ్ళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామనీ, దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్దింటి బిడ్డల కోసం 500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు వడ్డీ భారం పడకుండా 26 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని, కోటి రూపాయలు స్త్రీ నిధి అందిస్తున్నామని, ఈ డబ్బులను వృధా చేసుకోరాదని అన్నారు.
మహిళా సంఘంలో ఎవరైన ఆపతిలో ఉంటే వారికి ఆ సమయంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు , ప్రదవశాత్తు మహిళ చనిపోయే వారికి 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటి వరకూ చనిపోయిన వారికి 40 కోట్ల రూపాయలను, ప్రతిఒక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. మహిళా సంఘంలో రుణం తీసుకున్న తర్వాత అనుకొని కారణాలతో మహిళా చనిపోతే ఆ రుణభారం వారి కుటుంబాలపై పడకుండా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని, అదేవిధంగా 60 ఏండ్లు దాటిన మహిళకు, 15 సంవత్సరాలు దాటిని బాలికలకు మహిళా సంఘంలో సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని. ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారికి మహిళా సంఘాల ద్వారా రుణం కూడా ఇప్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల మహిళలకు ప్రతి నెల అద్దె బస్సుల రాబడిని అందించడం జరిగిందని అంతేకాకుండా కుట్టు మిషన్ పై ఆధారపడిన వారికి స్కూల్ యూనిఫామ్ పని అప్పగించడం, పెట్రోల్ బ్యాంకులు ఇప్పించడం జరుగుతుందని, ప్రభుత్వం ఏదైనా పేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం పంపిణీ చేయడం ఆగకూడదని గతంలోనే చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. తల్లి దండ్రుల లేని పిల్లకు మిషన్ వాత్స్యాల కార్యక్రమం కింద నెలకు సబ్సిడీ అందిస్తున్నామని, ఆరోగ్య శ్రీ అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.
షబీర్ అలీ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపు 13 సంవత్సరాల తరువాత నూతన రేషన్ కార్డులు దాదాపు 4 వేల పైన పంపిణీ చేయడం జరిగిందని, కొత్తగా పిల్లల పేర్లు రేషన్ కార్డులలో జమ చేయడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు, ఇది ఇందిరమ్మ రాజ్యమని అందరి సంక్షేమం కొరకు పని చేస్తుందని అన్నారు. లబ్దిదారులందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని, భారత దేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ లేదని ఒక్క తెలంగాణ లోనే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు, ప్రభుత్వం ఏర్పడ్డ కొంత కాలంలోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, మహిళలు కోటీశ్వరులను చేయాలని పెట్రోల్ పంపులు, ఉచిత రవాణా సదుపాయం కల్పించామని, 5 లక్షలు ఇంటి నిర్మాణం కొరకు ఇస్తున్నామని, ఇళ్ల మంజూరులో చిన్న చిన్న సమస్యలతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మండలం ఆర్థికంగా వెనుకబడి ఉందని 85 శాతం మహిళలు బీడీ కార్మికులకు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమలో చివరిగా అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులను, నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులను, బ్యాంకు లింకేజి 45 సంఘాలకు 5 కోట్లు, స్త్రీనిధి ఒక కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేసి వనమహోత్సవం కార్యక్రమలో భాగంగా మంతులు, కలెక్టర్ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్, డిఆర్డిఓ, జిల్లా సంక్షేమ అధికారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

