కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలే బీఆర్ఎస్‌ను గెలిపిస్తాయి : నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి
ధర్మారం, ఆగస్టు 6 : కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి దోహదపడతాయని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి, లంబాడి తండా (బి) గ్రామాలలో బీఆర్ఎస్ సమన్వయ ప్రత్యేక సమావేశాలు, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు మండల పరిధిలోని 29 గ్రామాల్లో పార్టీ ప్రత్యేకంగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ గ్రామ గ్రామాన గులాబీ జెండాను ఎగరవేయడం జరుగుతుందని అన్నారు. చెక్కు చెదరని విశ్వాసంతో పార్టీ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాల పాలనలో వాటిని నెరవేర్చడం లేదని అన్నారు.
వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ మేలు జరుగుతుందని బలరాం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల్లో మళ్లీ బీఆర్ఎస్ ఉంటేనే న్యాయం..
పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో పార్టీ ఎంతో బలంగా ఉందని, ప్రజల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ ఉంటేనే న్యాయం జరుగుతుందని ఆలోచన మొదలైందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సంక్షేమ పథకాలు అమలై మేలు జరిగిందనే చర్చ ప్రజల్లో మొదలైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదనే విషయాన్ని గడపగడపకు పార్టీ శ్రేణులు వివరించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.
ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ పాలనలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. 6 గ్యారంటీలు పాక్షికంగా మాత్రమే అమలు చేసి మిగతా వాటిని నెరవేర్చడం లేదని.. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మోసపూరితంగా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొని ప్రజలను వంచన చేసిందని వారు ధ్వజమెత్తారు.
కొందరు వలస పక్షుల మాదిరిగా విపక్ష పార్టీలో చేరారని.. వారిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పార్టీకి ప్రజల్లో మంచి పేరు ఉందని దానిని కాపాడుకోవడానికి గ్రామాల్లోని పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ భారత స్వామి, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసి మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ఎంపీటీసీలు భూక్య సరిత రాజు నాయక్, మిట్ట తిరుపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, పార్టీ మండల అనుబంధ అధ్యక్షుడు గుజ్జేటి కనుక లక్ష్మి అజ్మీరా మల్లేశం పార్టీ నాయకుడు పాక వెంకటేశం, ఎగ్గేల స్వామి,సాన రాజేందర్ ,ఐత వెంకటస్వామి, దేవీ రమణ, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, నేరెళ్ల చిన్న లచ్చయ్య, జంగిలి రవి, దేవి అజయ్, ఆవుల లత, కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, నెల్లి విజయ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

