చిట్టిచేతులతో వెట్టి చాకిరి.!

చిట్టిచేతులతో వెట్టి చాకిరి.!

1864c176-6861-49fb-9043-aa54421247fab3f758a7-95fc-422d-8b9d-48f744fd70e7

హమారా డాబాలో విచ్చలవిడితనం

మందు సర్వీసుతో పాటు చాకిరి చేయిస్తున్న యాజమాన్యం

కుత్బుల్లాపూరులో ఆమలు కానీ బాల కార్మిక నిషేధం, నియంత్రణ చట్టం

తక్షణమే రాష్ట్ర, జిల్లా బాలల హక్కుల కమిషన్ అధికారులు స్పందించి

చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిపుణుల 

నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : రోజులు మారుతున్న, తరలుమారుతున్న బాల కార్మికుల నిర్ములన చట్టాలు ఎన్ని వచ్చిన, ఈవ్యవస్థను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకొని, తక్కువ వేతనంతో శ్రమదోపిడి పాలుపడ్తున్నారు. 21వ సంవత్సరలు లోపు ఉన్న వారికి బారు, వైన్స్ ల్లో, వ్యాపారులు అస్సలు మధ్యం సరఫరా చెయ్యారదని ఎక్ససైజ్ పాలాసీల్లో ఉన్నాయి. బాల కార్మికుల నిషేధ, నిర్ములన చట్టం, మధ్యం పాలసీలు ఎన్ని ఉన్నా ఇవన్నీ జంతానై అన్నట్లు వ్యవహరిస్తున్నారు, మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, ప్రగతి నగర్ చౌరస్తా నుండి గండిమైసమ్మ వెళ్లే మెయిన్ రోడ్డులో ఉన్న హమారా రెస్టారెంట్ డాబా నిర్వాహకులు. బడికి వెళ్లాల్సిన పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. మధ్యం సేవించిన తరువాత ఖాళీగా వదిలేసిన సీసాలు, గ్లాసులు, ప్లేటులు తీయుస్తున్నారని సమాచారం. ఒకవేళ డాబా నిర్వాహకులు చెప్పినట్టు మైనర్లు వినకపోతే  బెదిరింపులకు సైతం వెనుకడడం లేరని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే మేడ్చెల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆపరేషన్ ముస్కాన్-11 సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి మాట్లాడుతూ., బానిసత్వానికి గురైన పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించే వరకు వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఆపరేషన్ ముస్కాన్-11లో భాగంగా జిల్లాలోని బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో ఆములు కవట్లేదని తెలుస్తోంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన, జిల్లా బాలల కమిషన్ సభ్యురాలు సరిత సైతం, ముస్కాన్ కార్యక్రమంలో పాల్గొని బాల కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన వారి హెచ్చరికలను పట్టించుకునే వారు లేరని అర్ధమవుతుంది. ఇప్పటికైనా అధికారులు ఉట్టిమాటలే కాకుండా చేతల్లో చూపాలని, పిల్లలకు పనిలో కాకుండా బడికి పంపేవిదంగా చూడాలని ప్రజలు సూచిస్తున్నారు. మైనర్లతో పనిచేయిస్తున్న హమారా రెస్టారెంట్ దాబాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు  స్థానికులు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గిరిజన ప్రజలకు ఆధార్‌ కార్డులివ్వండి గిరిజన ప్రజలకు ఆధార్‌ కార్డులివ్వండి
    గ్రామాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలి  సామాజిక కార్యకర్త, న్యాయవా ది కర్నె రవి   నమస్తే భారత్/ మణుగూరు మణుగూరు, : అందరికీ ఆధార్
వ్యవసాయ సహకార సంఘం అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలి 
గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వన మహోత్సవం
డివన్ పట్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలి.
పెండింగ్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల విడుదల చేయండి
ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి 
బాలలను పనులో చేర్చుకోకూడదు.అదనపు కలెక్టర్