ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన

ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన

 

హైదరాబాద్ పెద్దలు,సీనియర్ సిటిజన్ సుందర్ సైమన్, వ్యాపారవేత్త బాబురావు

నమస్తే భారత్ షాద్ నగర్,జూన్,05:
ఇటీవల కుటుంబ విషాదాన్ని ఎదుర్కొన్న ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించేందుకు సీనియర్ సిటిజన్ సుందర్ సైమన్, ప్రముఖ వ్యాపారవేత్త బాబురావు గురువారం ఆయన నివాసానికి చేరుకున్నారు.
డాక్టర్ వెంకన్న బాబు చిన్న కుమారుడు డాక్టర్ కొమ్ము మహర్షి అకాల మరణం పాలయ్యిన విషాదకర ఘటన నేపథ్యంలో, మృతుడి సతీమణి డాక్టర్ రజిత, తల్లి సారికతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అవసరమైన మానసిక భరోసా అందించారు.ఈ సందర్భంగా సుందర్ సైమన్ మాట్లాడుతూ – "ఇది వారి కుటుంబానికి తీరని లోటు. మాటలతో ఓదార్చడం సాధ్యం కాదు. కానీ మేము కుటుంబానికి అండగా నిలుస్తాం. ప్రతి క్షణం వారి వెంట ఉంటాం," అని ధైర్యం చెప్పారు.
అలాగే బాబురావు మాట్లాడుతూ – "డాక్టర్ వెంకన్న బాబు ఒక ఆదర్శవంతుడే కాదు, సమాజానికి చక్కటి మార్గదర్శకుడూ. ఆయన కుటుంబంలో జరిగిన ఈ విషాదం మనందరినీ కలిచివేసింది. మానవీయంగా, సామాజికంగా, అవసరమైన సమయంలో న్యాయపరంగా కూడా మా సహకారం నిరంతరం అందిస్తాం," అని తెలిపారు.ఇద్దరూ సంఘీభావం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు నెమ్మదిగా మనోధైర్యాన్ని కలిగించేందుకు తమ వంతు మద్దతు అందజేశారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News