భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.

నిర్ణీత గడువులోపు భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం.

భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.

ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు.

భూ భారతి చట్టం అవగాహన సదస్సులలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. 

నమస్తే భారత్: ములుగు బ్యూరో : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.  సూచించారు. శనివారం  ములుగు మండల కేంద్రంలోనిగ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణం లో, గోవిందరావు పేట మండలం కేంద్రం లోని రైతు వైదిక లో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుండి అభ్యంతరాలను తెలుసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్  ఒక్కో అంశం వారీగా వివరించారు.భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్ ఓ ఆర్) చట్టం - 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు.  భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు  పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా సీసీఎల్ఏ కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణి లో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు.  రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి  చట్టంలో కొనసాగుతాయని తెలిపారు.  భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపారు. భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులలో  జిల్లా పంచాయతీ అధికారి దేవ్ రాజ్, తహసీల్దార్లు విజయ భాస్కర్, సృజన్ కుమార్, ఎం పి డి ఓ లు రామక్రిష్ణ, జవహర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, స్థానిక అధికారులు,  రైతులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే  శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
  నమస్తే భరత్,,, 3/5/2025/ నారాయణపేట జిల్లా :మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం టై రోడ్ చెక్ పోస్ట్ వద్ద శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
ప్రతిభకు పట్టాభిషేకం 
ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లలో ఎంపిక చేయాలి 
ప్యాట జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చౌదరిగూడ మండలంలో మహిళా నాయకత్వానికి బలమైన పునాది….
ఉద్యమకారుడు రాచమల్ల నరసింహ మృతి: బి.ఆర్.ఎస్ నాయకుల నివాళుల లు ఆర్పించారు
ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి