టి యు డబ్ల్యూ జె(ఐ జె యు) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక
ముఖ్య అతిధి గా పాల్గొన్న మఫిషియల్ జర్నలిస్ట్ కమిటీ రాష్ట్ర కన్వినర్ గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న )
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం టీ యూ డబ్ల్యూ జె(ఐ జె యు) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ని మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాఫిషియల్ జర్నలిస్ట్ కమిటీ రాష్ట్ర కన్వినర్ గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న ), రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీశైలం, కార్యదర్శి రాఘవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ని వారు శుభాకాంక్షలు.తెలియజేశారు.నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ లో అధ్యక్షుడిగా నర్సింహా ( ఎన్ టివి), ఉపాధ్యక్షులుగా సలీం (1టివి), శ్రీనివాస్ (స్టూడియో 18), శివ ( సి వి ఆర్ టివి) ప్రధాన కార్యదర్శి గా ఫయాజ్ ( బిగ్ టివి),సంయుక్త కార్యదర్శి గా విష్ణు (6 టివి), రాజు (మెగా టివి), సాబెర్ ( ఏ ఎన్ ఎన్ టివి), కోశాధికారి గా రజ్జాక్ ( మున్సిఫ్ టీవీ ) ఉన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడిన ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ని టి యు డబ్ల్యూ జె (ఐ జే యు) తరుపున సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

