తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి

తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి

 

నూతన వాహనాల ప్రారంభోత్సవం

15 ఆర్థిక సంఘం నుండి కొనుగోలు

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూర్ 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడాల యశస్విని రెడ్డి  నూతన వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొర్రూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొనుగోలు ఎంతో అవసరం అని ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ  వాహనాలు, జెసిబి.వాటర్ ట్యాంకర్లు,  పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయని అన్నారు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూపాయలు 89 లక్షల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగిందని మున్సిపల్ ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వందరోజుల కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు.పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయని అన్నారు ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తుందని
మున్సిపల్ సిబ్బంది  సమర్థవంతంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని 
ఈ కార్యక్రమంలో కమిషనర్ శాంతి కుమార్. మున్సిపల్ ఏఈ రంజిత్. మేనేజర్ కట్ట స్వామి. హెల్త్ అసిస్టెంట్ రాజు. వార్డ్ ఆఫీసర్లు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు,  పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తొక్కిసలాట సమయంలో 5 వేల మంది పోలీసుల్లేరు, వెయ్యి మంది మాత్రమే..: హైకోర్టులో వెలుగులోకి తొక్కిసలాట సమయంలో 5 వేల మంది పోలీసుల్లేరు, వెయ్యి మంది మాత్రమే..: హైకోర్టులో వెలుగులోకి
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బుధవారం రోజు బెంగళూరులో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది...
కన్నుల పండుగా బొడ్రాయి ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన ఉత్సవాలు
అమరావతిలో వనమహోత్సవం.. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
నా కన్నతల్లే నాకు కన్నప్ప.. ‘మై కన్నప్ప స్టోరీ’ అంటూ మోహన్‌బాబు ప్రత్యేక వీడియో
ఆటోపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు యాత్రికులు మృతి
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదులో తప్పిదాలు చేయవద్దు : కలెక్టర్‌ సంతోష్ కుమార్
భూదాన్ పోచంపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘ భవనం ప్రారంభం