గిరిజన మహిళా సొసైటీలకే ఇసుక ర్యాంపులు
ఇసుక ర్యాంపులు నడుపుకొని వారి జీవనోపాధి పెంపొదించుకోవడమే ముఖ్యం
నమస్తే భారత్: భద్రాచలం
ఐటీడీఏ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు పారిశ్రామికంగా చేయూత అందించడానికి గిరిజన ఇసుక సొసైటీలకు ఆర్థిక సహాయం అందించి ఆదివాసి గిరిజన మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పెంపొందించుకొని తమ గ్రామాలలోని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పొందడానికి ఆ గ్రామంలోని గిరిజన మహిళా సోసైటీలకే పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపులు నడిపించుకునే బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీలతో ఒకరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ మహిళలతో ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి ఇసుక ర్యాంపుల నిర్వహణ వారికి అప్పగించకుండా మహిళలందరూ ఐకమత్యంగా ఉండి గోదావరిలో నుండి ఇసుక వెలికితీత నిర్వహణ బాధ్యత, ఉత్పత్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న సొసైటీలు సొంతంగా ఇసుక ర్యాంపులు నిర్వహించుకోవడానికి, తద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద రెండు సొసైటీలను ఎంపిక చేసి సొసైటీ కి 50 లక్షల చొప్పున ఆర్థికవేసులుబాటు కల్పించి అధికారుల సహాయంతో గోదావరిలో ఇసుక స్టాక్ పాయింట్ గుర్తించి టిప్పర్లు ప్లానింగ్ మిషన్ డోజర్లు అద్దెకు ఇప్పించడం జరుగుతుందని, వాటి ద్వారా ఇసుక స్టాక్ పాయింట్ కి తరలించిన దగ్గర నుండి ఎన్ని క్యూబిక్కుల ఇసుక టిప్పర్ల ద్వారా రవాణా అవుతున్నది, ఇసుక స్టాక్ పాయింట్ కి చేరవేసిన దగ్గర నుండి వాటి నిర్వహణ బాధ్యత పూర్తిగా ఇసుక సొసైటీ మహిళలే నిర్వహించాలని అన్నారు.అంతకుముందు ఇసుక ర్యాంపుల నిర్వహణ తీరు మరియు ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక ర్యాంపులు నిర్వహించే మహిళలు ఆ గ్రామానికి సంబంధించిన వారే ఉండాలని, బినామీలను ఎవరిని దరిచేరకుండా చూడాలని, ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళలు ఇసుక ర్యాంపుల పూర్తి బాధ్యత తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అన్నారు. ఇసుక ర్యాంపులు సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళలకు సాంకేతిక సహకారం మరియు ఆర్థిక సహకారంతో పాటు మహిళలందరికీ తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా తగిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన సొసైటీల పనితీరును చూసి మిగతా సొసైటీలు ఆదర్శంగా తీసుకునే విధంగా గిరిజన మహిళలు ఇసుక ర్యాంపులు సమర్థవంతంగా నిర్వహించుకోవాలని, ఇసుక ర్యాంపుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసా స్పెషల్ ఆఫీసర్ మనిధర్ తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, వివిధ గ్రామాల నుండి వచ్చిన సొసైటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

