బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
నమస్తే భారత్ :-డోర్నకల్ డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత రెడ్యానాయక్‌పై పోలీసులు ఇవాళ(మంగళవారం) కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌తో సహా 17 మందిపై కేసులు పెట్టారు. నిన్న(సోమవారం) డోర్నకల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా సోమవారం నాడు డోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ర్యాలీ నిర్వహించారు. దీంతో డోర్నకల్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండు పార్టీల్లోని నేతలనూ నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో డోర్నకల్ నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.పోలీసుల సూచనలు అతిక్రమించడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని డోర్నకల్ పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసు కేసులతో డోర్నకల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

