వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఏఎస్ఐ ఆంజనేయులు

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఏఎస్ఐ ఆంజనేయులు

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐ పియస్ ఆదేశాల మేరకు వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అలాగే ప్రజలు సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నారాయణపేట పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పకుండా ఉపయోగించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, త్రిబుల్ రైడింగ్ లో వాహనాలు నడపరాదని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా వెళ్లాలని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని తెలిపారు. యువకులు డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి అలవాటు వల్ల అవి వ్యసనంగా మారే అవకాశం ఉంటుందని, కావున వాటిని ఆదిలోనే తుంచి వేయాలని తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌ భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌
దేవ‌ర‌కొండ రూర‌ల్‌, జూన్ 18 : భూ నిర్వాసితుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్...
ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి
స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌
ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక
గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్
రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్
మార్పు కోసం.. ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ షూటింగ్‌ షురూ