బహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న 

బహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న 

 

ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ 

ఈ విగ్రహం కేవలం రాయి కాదు, మన చరిత్రకు సాక్ష్యం, మన భవిష్యత్తుకు ప్రేరణ

 నమస్తే భారత్ :-మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కురవి గేట్ సమీపం లో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్  మహబూబాబాద్ శాసనసభ్యులు మురళి నాయక్ పార్లమెంట్ సభ్యులు, పోరిక బలరాం నాయక్ ,డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి అనంతరం ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్  మాట్లాడుతూ.వరంగల్ ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న ఒక ప్రజానాయకుడు,తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 
16వ శతాబ్దానికి చెందిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు. 20 కోటలను ఆక్రమించి గోల్కొండ కోట మీద బహుజన జండా ఎగరవేసి అతని జీవితం ధైర్యం, సాహసం మరియు ప్రజాసేవకు నిదర్శనం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘలుల అరాచకాలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఒక బలమైన రాయల రాజ్యం స్థాపించాడు. ఇతను మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మొదటి స్వతంత్ర భారతీయ నాయకుడిగా చరిత్రలో నిలిచారు.మొఘలుల నియమాలను ధిక్కరించి స్వతంత్ర పాలనకు నాంది పలికిన గొప్ప వ్యక్తి.ఆయన పేదవారికి, వెనుకబడిన తరగతులకు రక్షణ కలిగించడమే కాదు, వారి అభివృద్ధికి కూడా కృషి చేశారు. ప్రజలలో ధైర్యం నూరిపోసి, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేందుకు శ్రమించారు.
అతని సేవలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి గర్వకారణం.
దొరలకు తలొగ్గని వీరుడు, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన విప్లవానికి ప్రతీక, దమనానికి వ్యతిరేకంగా గళమెత్తిన సింహస్వరం. 
చిన్నచిన్న రైతులు, కూలీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యవంతుడు. రాజుల ఆడంబరానికి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల కోసం స్వరాజ్యాన్ని సృష్టించాలని కలగన్న మొదటి నాయకులలో ఒకరు.ఆయన పోరాటం మనకు చెబుతోంది అధికారం ఎప్పటికీ ప్రజలకే చెందాలి, దోపిడీ, అన్యాయం ఎక్కడ ఉన్నా దానికి ఎదురు నిలబడాలి. అనే చాటి చెప్పిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ విగ్రహం కేవలం రాయి కాదు, మన చరిత్రకు సాక్ష్యం, మన భవిష్యత్తుకు ప్రేరణ.ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని  నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా జన్మ ధన్యం.
గౌడ కులస్థుల పోరాట పటిమను చూపిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మన జిల్లా కేంద్రంలో .గౌడ కులస్థులు అందరూ ఏకమై నేడు ఈ పోరాట యోధుడు శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు ఎంతో కృషి చేశారు అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Views: 9

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Error on ReusableComponentWidget

Latest News

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి.అభిమానుల మధ్య ఘనంగా పేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.వెనుకబడిన ఈ ప్రాంతం
నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న
సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి
ఆగమరిస్తే అంతే సంగతి 
జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు.
దోమలు నివారణకు జాగ్రత్తలు పాటించాలి:
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం