కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది..! కేంద్రం జనాభా గణన నోటిఫికేషన్ జైరాం రమేశ్ వ్యాఖ్యలు.
జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేలవంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల గణణ చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వం మరో యూ-టర్న్ కాదా? అని ప్రశ్నించింది. కుల గణను మాత్రమే కాకుండా కులాల వారీగా సామాజిక-ఆర్థిక పారామితులపై వివరణాత్మక డేటా తెలిసేలా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. 2026-27లో జరుగనున్న జనాభా లెక్కలకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ తరహాలోనే ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. జనాభా లెక్కల కోసం చాలా ప్రచారం చేసిన నోటిఫికేషన్‌ను చివరకు జారీ చేయశారని.. కానీ, ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని విమర్శించారు. 2025 ఏప్రిల్ 30న జారీ చేసిన నోటిఫికేషన్‌ను పునరుద్ఘాటించిందన్నారు. జాతీయ కాంగ్రెస్ డిమాండ్, ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి కుల గణన డిమాండ్‌కు తలొగ్గారని.. డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సల్స్‌గా పిలిచారని విమర్శించారు. కేంద్రమే కుల గణన చేస్తామని ప్రకటించిందని.. తాజా నోటిఫికేషన్లో కుల గణన గురించి ప్రస్తావించలేదన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

