ఐఐటి ధృవపత్రాన్ని అందుకున్న విద్యార్థి విష్ణు
On
నమస్తే భారత్ :-తొర్రూరు
ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక కోర్సులను పరిచయం చేసేందుకు స్కూల్ కనెక్ట్ పేరిట ఐఐటి మద్రాస్ 8 వారాల పాటు నిర్వహించే 10 రకాల ఆన్ లైన్ కోర్సులను ఈ విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్ లో పదో తరగతి విద్యార్థులకు లభించింది. దీంతో మండలంలోని నాంచారి మడూరు జయంతి కాలనీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పి. విష్ణువర్ధన్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎన్.అనుపమ సహకారంతో డేటా సైన్స్ పరిచయం.ఆర్టిఫిషియల్ ఇంజిలిజేన్స్ కోర్సులో చేరారు. ఆగస్టు 4న ఆన్ లైన్ పాటలు ప్రారంభమై, సెప్టెంబర్ 29 ముగిశాయి. ఆ తర్వాత ఆన్ లైన్ లోనే పరీక్షలు జరిగాయి. తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి పూర్తిచేసుకుని ధృవపత్రాన్ని అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరన్న తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు విష్ణువర్ధన్ అభినందించారు.
Tags
Related Posts
Latest News
12 Nov 2025 09:16:11
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
