రెడ్డిగూడెం భూములపై సాగులో ఉన్న ఆదివాసులకు, పేదలకే పట్టాలి ఇవ్వాలి.

రెడ్డిగూడెం భూములపై సాగులో ఉన్న ఆదివాసులకు, పేదలకే పట్టాలి ఇవ్వాలి.

 

 ఏఐకేఎంకేస్ జాతీయ నాయకులు ప్రసాదన్న


నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం


 రెడ్డిగూడెం 126 సర్వేనెంబర్ భూములపై ఆదివాసులు పేదలకే హక్కు కల్పించాలని ఏఐకేఎంకే జాతీయ నాయకులు ప్రసాదన్న డిమాండ్ చేశారు. రెడ్డిగూడెంలో ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, సారపాక భూఆక్రమణదారుల నుండి రక్షణ కల్పించాలని తెలంగాణ రైతు కూలి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పాల్వంచలోని నటరాజ్ సెంటర్ నుండి దమ్మపేట క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిపి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏ ఐ కే ఎం కే ఎస్ జాతీయ నాయకులు ప్రసాదన్న మాట్లాడుతూ.. పాల్వంచ మండలం పాండురంగాపురం రెవిన్యూ ప్రభాత్ నగర్ (రెడ్డిగూడెం) శివారు 126 సర్వేనెంబర్ రెవిన్యూ భూములపై జరిగిన పోరాటం గురించి అందరికీ తెలిసిందేనని, ఈ భూములు పాల్వంచ, బూర్గంపాడు, అశ్వాపురం మూడు మండలాల సరిహద్దుల్లో ఉన్నాయి. గత రెండు దశాబ్దాల నుండి పాల్వంచ మండలం తో పాటు సరిహద్దు చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజన గిరిజన పేదలు 167 మంది ఈ భూములలో ఉన్న చెట్లు తుప్పలు నరికి భూములను సాగు చేశారు. సాగు చేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొనుటకు సారపాక కు చెందిన ఏనుగు వెంకట్ రెడ్డి, గొల్ల మరి రత్నారెడ్డి, సైదులు ఆధ్వర్యంలో స్థానిక ఉప సర్పంచ్ గా ఉన్న కళ్లెం వెంకటరెడ్డిని కలుపుకొని బయట నుండి కొంతమంది రౌడీషీటర్లను గుండాలను తీసుకొని వచ్చి ఆ భూముల్లో సాగులో ఉన్న ఆదివాసి గిరిజనులపై రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గిరిజనేతర పేదలపై దాడి చేసి చీరలు లాగి, జాకెట్లు చిoచ్చి నానా బీభత్సం సృష్టించారు. అనేకమందికి గాయాలయ్యాయి వారికి నాయకత్వం వహించిన రైతుకూలీ సంఘం నాయకుడు కామ్రేడ్ మోర రవిని హతమార్చాలని ఇనుపరాడ్లు ఇనుప పైపులతో విచక్షణారహితంగా దాడి చేసి చనిపోయాడని చెట్ల పొదల్లో విసిరిసి వెళ్లిపోయారు. సంఘము ప్రజలు వైద్యశాలకు తరలించి బ్రతికించుకున్నారు. అయినా ప్రజలు ఆ భూములను వదిలిపెట్టకుండా సాగులో ఉన్నారు. కొంతకాలం క్రితం ఏనుగు వెంకట్ రెడ్డి  సంఘ నాయకులతో మాట్లాడి ప్రజలు సాగుచేసిన భూముల జోలికి రామని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రజలు సాధించుకున్న భూములను క్రమ క్రమంగా ఆక్రమించుకుంటూ రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేయించుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. భూములపై సాగులో ఉన్న రెడ్డి గూడెం గ్రామానికి చెందిన గిరిజనేత్ర పేదలు, ఆదివాసి గిరిజనులు వారికి మొదటి నుండి నాయకత్వం వహించిన కామ్రేడ్ మోర రవి పై వారి భూముల్లోకి అక్రమంగా వచ్చి మా భూములు సాగు చేస్తున్నారంటూ పోలీస్ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో ఆదివాసీలు గిరిజన గిరిజనేతర  పేదలు తమ భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో నాలుగు జులై 2025న ఏనుగు వెంకట్ రెడ్డి వదిన సోమ లాలమ్మతో రెడ్డిగూడెం గిరిజనేతర పేదలు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ వారు ఆదివాసి గిరిజన ప్రజలను ఒక రోజంతా స్టేషన్ బయట ఉంచి మీకు అక్కడ భూములు ఎక్కడివి మీరు ఆ భూముల్లోకి వెళ్ళవద్దని హెచ్చరించి పంపారు. ఈ సూర్యపేట నుండి వలస వచ్చిన వారికి గతంలో ఘర్షణలు జరిగినప్పుడు ఈ భూమికి సంబంధం లేదు. అప్పటికి వారు వారికి సంబంధించిన భూమిలోనే ఉన్నారు. వారు గేట్టు హద్దులు దాటి భూమి ఆక్రమించడం వల్లనే వారితో సమస్య మొదలైంది. బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన ఏనుగు వెంకటరెడ్డి, గొల్లమరి రత్నారెడ్డి సైదులు వీరు రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి కలుపుకొని రెడ్డి గూడెం గ్రామానికి చెందిన వీరికి గులాంగిరి చేసే ఇద్దరిని వెంటబెట్టుకొని గొల్లమారి రత్నారెడ్డి పేర్లతో కంప్లైంట్ చేశారు. ఆ భూములు కొనుక్కున్నామని ఒకసారి, అవి వారి తాతల భూములనీ మరోసారి చెబుతూ 10 సంవత్సరాల క్రితం వారికి పట్టాలు అయ్యాయని భూములు తమకే చెందుతాయని వక్రీకరిస్తూ ఆదివాసి గిరిజనులను నాన్ లోకల్ అంటూ వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. 126/150,126/151,126/152,126/162,126/11, సర్వే నంబర్లు గల భూములలో నకిలీ మాన్వెల్ పహానిలు చూపిస్తూ మాకు పట్టాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఈ నెంబర్లలో రికార్డుల్లో నూకల దామోదర్ రెడ్డి, నూకల సుమిత్రాదేవి లోకేందర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరు ఈ ప్రాంతంలో ఎప్పుడు సాగులో ఉన్నట్టు గుర్తింపులో లేదు. రికార్డుల్లో పేర్లు మాత్రమే ఉన్నాయి. మనుషులు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఇవి చెల్లుబాటులో లేవు. సాగులో ఉన్నది చిన్న సన్న కారు బీద రైతులు 2017-18 ముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు వీఆర్వోలు క్రాఫ్ లోన్ల కోసం రైతులకు మ్యానువల్ పహానీలు రాసి ఇచ్చేవారు. అదే అదనుగా రెవిన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి భూమి లేని వారికి కూడా మాన్యువల్ పహానిలు రాసి ఇచ్చారు. ఆ సందర్భంలో భూములపై సాగులో ఒకరు ఉంటే నకిలీ పహానియులు బ్యాంకుల్లో పెట్టి లోన్లు పొందినవారు మరికొందరు. భూములు ఒకరివైతే పహానిలు మరొకరి దగ్గర ఇలాంటి అక్రమాల వల్ల జిల్లాలో ఎక్కడ లేని విధంగా పాండురంగాపురం రెవిన్యూ విలేజ్ పరిధిలో భూ సమస్యలు జటిలంగా మారాయన్నారు. వీరు కూడా ఆ కోవకు చెందిన వారే 2018 నుండి మాన్యువల్ పహానిలో ప్రభుత్వం నిలిపివేసింద. ఏనుగు వెంకటరెడ్డి రత్నారెడ్డి తదితరులు  భూములు కొన్నామని చెబుతున్నారని, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వచ్చినప్పటినుండి ఏజెన్సీ ప్రాంతంలో భూములు అమ్మటం కొనడం నిషేధించబడిందన్నారు. ఆ రకంగా చూసిన వీరికి ఆ భూములపై ఎలాంటి హక్కు లేదని, అసలు ఇప్పటివరకు పాండురంగాపురం రెవిన్యూ పరిధిలో సాగు చేసుకుంటున్నా గిరిజన రైతులకు కొద్దిమంది మినహా ఎవరికి పట్టాలు లేవు. వారికే లేనప్పుడు సారపాక వారికి సూర్యాపేట ప్రాంతం నుండి వలస వచ్చిన వారికి పట్టాలు ఎవరు ఇచ్చారు. వాటిని వేనక నడిచిన బాగోతం ఏమిటో బయటికి రావాలన్నారు. నకిలీ పహానిలు చూపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేయగానే పోలీసులు రెవిన్యూ అధికారులకు రిఫర్ చేయాలి, అలా చేయకుండా పోలీస్ వారు ఏజెన్సీ ఆదివాసి చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా కష్టపడి సాగు చేసుకున్న ఆదివాసులు స్థానికులు కాదని మాట్లాడటం సరికాదన్నారు. భూములకు చుట్టూ సమీపంలో నడిచి వచ్చేంత దూరంలో ఉన్న గ్రామాల ఆదివాసి గిరిజనులు బయటి వ్యక్తులా? లేక ఏజెన్సీలో గిరిజనేతరులైన సారపాక వారు, సూర్యపేట వారు బయట వ్యక్తులా పోలీస్ వారు ఆలోచించాలన్నారు, ఇది ఏమీ పట్టించుకోకుండా పాల్వంచ రూరల్ పోలీస్ వారు తమ భూముల వద్దకు రెండు ట్రాక్టర్లలో వెళుతున్న ఆదివాసి గిరిజనులను మధ్యలోనే, రోడ్డుపై అడ్డగించి ట్రాక్టర్లతో సహా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి, ఆదివాసీలను మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ భూముల్లోకి వెళ్ళవద్దని బెదిరించి ఆ భూములు సారపాకకు చెందిన వారీవేనని తీర్మానించి తీర్పు ఇచ్చారు. పోలీసులు, రెండు రోజులు పోలీసు వారు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివాసి పేదలను పడిగాపులు ఉంచారన్నారు. ఆదివాసీలపై కేసులు బనాయించారన్నారు. 
కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూములపై విచారణ జరిపించి ఆదివాసులతో పాటు  సాగు చేసుకుంటున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, అక్రమంగా పహానిలు పొందిన ఏనుగు వెంకట్ రెడ్డి, గొల్ల మరి రత్నారెడ్డి, సైదులు, రాజశేఖర్ రెడ్డి ,లక్ష్మారెడ్డి లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ న్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడం మల్లేశం, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు బుర్ర ఆనంద్, పల్లెబోయిన స్వామి, తెలంగాణ రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పున్నం చందు, కుంజ  వెంకటేశ్వర్లు, తోలెం మమత, కుంజ సోమక్క, సోంది గోపమ్మ, దండి కొమురయ్య, బండ రాంబాబు, కారం భద్రయ్య, కంపేర్ల సూర్యం, సూరమ్మ  తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు   వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు  
                                  మెదక్,జూలై18(నమస్తే భారత్):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాతను శుక్రవారం రోజు ఇటీవల నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర   అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు,మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ
అత్తాపూర్ పాఠశాలలో వెరీజాన్ సహకారంతో  స్టెమ్ ల్యాబ్‌లో అవగాహన కార్యక్రమం 
శ్రీ శ్రీ శ్రీ బంగారు పోచమ్మ దేవాలయానికి మంగలారం శ్రీనివాస్ దంపతుల విరాళం 
శేరిలింగంపల్లి ప్రాజెక్టులో అంగన్‌వాడీల ధర్నా: సమస్యల పరిష్కారానికి సీడీపీవోకు వినతి 
ప్రజా రోగ్యం కోసం నిబద్దత తో పని చేస్తున్న వైద్యులకు ఎప్పటికి గుర్తింవు ఉంటుంది 
ప్రజా రోగ్యం కోసం నిబద్దత తో పని చేస్తున్న వైద్యులకు ఎప్పటికి గుర్తింవు ఉంటుంది 
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం...