the-disabled-house-will-be-successful-in-shamshabad-on-the - Namasthe Bharat

ఈ నెల 18న శంషాబాద్ లో నిర్వహించే వికలాంగుల, చేయూత సభను విజయవంతం చేయాలి.
పెన్షన్ దారుల సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

పెన్షన్ పెంపు కోసం సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో పెన్షన్ దారుల గర్జన మహాసభ.

రేవంత్ రెడ్డి మాట నిలుపుకోవాలి

పెన్షన్ దారుల శక్తి ఏంటో ప్రభుత్వానికి చూపిస్తాం..

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ.

నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఆగస్ట్ 16.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ లు రూ 6000 కు అలాగే అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4000 పెంచి అర్హులైన ప్రతిఒక్కరికి అందజేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ  డిమాండ్ చేశారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం
శంషాబాద్ మండల పరిధిలో శనివారం మల్కారం, కాచారం, చౌదరిగూడ గొల్లపల్లి, చిన్నగాలకొండ గ్రామాల్లో పెన్షన్ చైతన్య సభలు నిర్వహించడం జరిగింది.ఈ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగలు పాల్గొని మాట్లాడుతూ " కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ దారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా నెలకు వెయ్యి కోట్ల చొప్పున 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను పక్కదారి పట్టించి కాళ్లులేనొల్ల, చేతులు లేనోళ్ల, కండ్లు లేనోళ్ల పెన్షన్ డబ్బులను ఎగగొట్టడం రేవంత్ రెడ్డి సర్కార్ కు తగదని మండిపడ్డారు. పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే పేదల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచరు.. ప్రతిపక్షం అడగరు..? ఇద్దెక్కడి న్యాయమని ప్రశ్నించారు.అందాల పోటీలకు, భూస్వాములకు రైతు భరోసాకు, అభివృద్ధి పేరుతో, యాడ్ ల పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, కాళ్ళు, కళ్ళు, మాట్లాడలేని వికలాంగులకు, వయసు మీద పడిన వృద్ధులకు, భర్త లేకుండా బిడ్డలను పోషించే శక్తీ లేని వితంతువులకు, తీవ్రమైన రోగాలతో చావుతో సావాసం చేస్తున్న కండరాల, రక్త హీనత కల్గిన ఇతర రోగులకు పెన్షన్ పెంచకుండా ఎందుకు అన్యాయం చేస్తున్నావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెన్షన్ దారుల బాధల్ని పట్టించుకోని ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటాల ద్వారానే గుణపాఠం చెప్తమని అందుకోసం సెప్టెంబర్ 9 లోపు పెన్షన్ పెంచకపోతే 9న పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో  పెన్షన్ దారుల గర్జన మహాసభ నిర్వహించి పెన్షన్ దారుల శక్తి ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు.పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పేదల కోసం జరిగే చేయూత పెన్షన్ దారుల సభ  శంషాబాద్ బేగం ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామం నుండి పెన్షన్ దారులు వేలాదిగా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారని అందుకు ప్రతి గ్రామం నుంచి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత బీడీ కార్మికులు చేయూత పెన్షన్ దారులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్పీ ఎస్ శంషాబాద్ ఇంచార్జి కొత్తూరు రమేష్ మాదిగ, అధ్యక్షులు భాస్కర్ మాదిగ, రాష్ట్ర బాధ్యులు మంగళారం రత్నం మాదిగ, MSF శంషాబాద్ నాయకులు పాల మహేష్ మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.