79th-independence-day-celebrations-at-prakasam-stadium-under-singareni - Namasthe Bharat

సింగరేణి ఆధ్వర్యం లో ప్రకాశం స్టేడియం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నమస్తే భారత్ (ప్రతినిథి ప్రశాంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఆగస్టు -15)_ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు సింగరేణి ఆధ్వర్యం లో 79వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.బలరాం, ఐ‌ఆర్‌ఎస్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఎస్&పి‌సి సిబ్బంది స్కౌట్స్ కలర్ పార్టీ ముఖ్య అతిథిని వేదిక వద్దకు తీసుకొని రాగా, ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని  ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.బలరాం, ఐ‌ఆర్‌ఎస్ గారు ఎగురవేశారు. అంతకు ముందు సింగరేణి ప్రధాన కార్యాలయము నందు సింగరేణి డైరక్టర్(పా) శ్రీ గౌతమ్  పొట్రు, ఐ‌ఏ‌ఎస్ గారు,  ప్రాజెక్ట్ ప్లానింగ్ కార్యాలయము నందు డైరక్టర్ (పి&పి) కె.వేంకటేశ్వర్లు గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  అదే విధముగా సింగరేణి కార్పొరేట్ ఏరియా పరిధి లోని అన్ని డిపార్ట్మెంట్స్ మరియు సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు జాతీయ జెండా ను ఎగరవేశారు. అనంతరం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది మరియు కొత్తగూడెం పట్టణం లోని వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, కలర్ పార్టీ, బ్యాండ్ పార్టీ బృందాలు  గౌరవ  కవాతు వందనం(మార్చ్ ఫాస్ట్) చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.బలరాం, ఐ‌ఆర్‌ఎస్ గారు ఆయన మాట్లాడుతూ సింగరేణి అధికారులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, పురజనులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక ప్రజలు అందరికీ 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులకు, త్యాగ ధనులకు ఈ సందర్భంగా మనందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాను.

స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ఉన్నతిని సాధించాం. ఒకప్పుడు ప్రతీ విషయంలోనూ ఇతర దేశాలపై ఆధారపడిన మనం ఇప్పుడు దాదాపు పూర్తిస్థాయిలో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించగలిగాం. ఈ క్రమంలో నేడు మన భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. ఇది మనకెంతో గర్వకారణం. త్వరలోనే మన భారతదేశం అన్ని రంగాలలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగాలని అందుకు భారతీయులుగా మన వంతు కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని  తెలియజేసారు.

136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందించడమే కాక మరో నాలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం తగినంత బొగ్గును సరఫరా చేయటం జరుగుతుంది. అలాగే 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, మరో 245.5 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ను కూడా అందించడం జరుగుతుంది. అయితే సింగరేణి సంస్థను మరింత పటిష్టపరచడం కోసం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం కోసం మన కంపెనీ తన వంతుగా బొగ్గు ఉత్పత్తిని అనతి కాలంలోనే 100 మిలియన్ టన్నులకు పెంచాలని, థర్మల్ విద్యుత్ ను 3,000 మెగావాట్లకు, సోలార్ విద్యుత్ ను 5,000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళికలు రూపొందించడం జరిగినది అని, ఇంతే కాకుండా నేటి ఆధునిక కాలంలో అత్యంత అవసరమై ఉన్న కీలక ఖనిజాల రంగంలోకి కూడా సింగరేణి సంస్థ ప్రవేశించాలని నిర్ణయించింది. త్వరలోనే పలు రకాల కీలక ఖనిజాల అన్వేషణలోనూ, ఉత్పత్తిలోనూ స్వయంగా కానీ, జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా గానీ ప్రవేశించనున్నదని తెలియజేస్తున్నాను. ఈ విధంగా సింగరేణి సంస్థ రాష్ట్ర దేశ అభివృద్ధికి పునరంకితమై పని చేస్తుందని ఈ శుభ సందర్భంగా ప్రకటిస్తున్నాను.

అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు బొగ్గు మార్కెట్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో దక్షిణ భారతదేశంలో కేవలం సింగరేణి సంస్థ ఒక్కటే బొగ్గును ఉత్పత్తి చేస్తుండేది. కానీ ఇప్పుడు అనేక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలతో మనం పోటీపడే పరిస్థితి ఏర్పడింది. కోల్ ఇండియా వారు గత దశాబ్ద కాలంలో బొగ్గు ధరలను కేవలం 20 శాతం మాత్రమే పెంచగా, మన సింగరేణిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వలన, ప్రతీ వేజ్ బోర్డుకు పెరుగుతున్న జీతాల వల్ల మనం బొగ్గు ధరలను క్రమంగా పెంచుతూ ఇప్పుడు 170 శాతం వరకు వచ్చాము. మన ఓపెన్ కాస్ట్ గనులు టన్ను బొగ్గుకు సగటున సుమారు 8 క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి రావడం, భూగర్భ గనుల్లో కూడా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మనం బొగ్గు ధరలను పెంచుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాలం వరకు మన బొగ్గుకు డిమాండ్ ఉంది. కానీ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం, ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం మన బొగ్గుకు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది.

ఎందుకంటే మనకంటే తక్కువ ధరకి అంటే టన్నుకు దాదాపు రెండు వేల రూపాయలు తక్కువకు కోల్ ఇండియా సబ్సిడరీ కంపెనీలు బొగ్గును అమ్ముతున్నాయి. విదేశాల నుంచి కూడా చౌక ధరకే బొగ్గు లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనతో ఎంతో అనుబంధం ఉన్న వినియోగదారులు కూడా మన బొగ్గు కొనడానికి ఆసక్తి చూపించటం లేదు. మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి గానీ, ఇతర కంపెనీల నుంచి కానీ వినియోగదారులు బొగ్గు కొంటున్నారు. గతంలో ఏడాదికి 110 లక్షల టన్నుల బొగ్గును మన నాన్ పవర్ సెక్టార్ వినియోగదారులు తీసుకునేవారు. కానీ ఈసారి 50 లక్షల టన్నుల కన్నా ఎక్కువ తీసుకోలేదు. కారణం మన బొగ్గు ధర ఇతరుల కన్నా ఎక్కువగా ఉండటమే. అలాగే మరో ప్రమాదకర పరిస్థితి ఏమిటంటే మన దగ్గర నుంచి సుమారు 90% బొగ్గును తీసుకుంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వాళ్ళు కూడా సింగరేణి సంస్థ బొగ్గు ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ధరకు లభించే చోట బొగ్గు తీసుకోవడానికి అనుమతించాలి అని ప్రభుత్వాలను కోరుతున్నారు. మనతో ఉన్న ఇంధన సరఫరా ఒప్పందాలను కూడా సడలించాలని ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వాలు అనుమతిస్తే ఇక సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అన్నట్లే. ఇది ప్రస్తుతం మన ముందున్న సవాల్..!

మన బొగ్గు ధర తగ్గాలంటే మన ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలి. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే మన యంత్రాలు, మనం షిఫ్ట్ లో ఉన్న ఎనిమిది గంటల సమయాన్ని సంపూర్ణంగా వినియోగించాలి. అప్పు మన ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అప్పుడు బొగ్గు అమ్మకం ధర తక్కువ చేసినప్పటికీ నష్టం ఉండదు.మన వినియోగదారులు మనతోనే ఉండాలి అంటే ప్రస్తుతం మనం కనీసం టన్నుకు వెయ్యి రూపాయలైనా బొగ్గు ధరను తగ్గించాల్సిన గత్యంతరం లేని పరిస్థితులు మన ముందుకు వచ్చాయి. ఈ సవాళ్ళను స్వీకరించి, బొగ్గు ధరను తగ్గించుకుంటేనే తప్ప మనకు భవిష్యత్తు లేదు...

బొగ్గు ధరతో పాటు బొగ్గు నాణ్యత కూడా ఎంతో ప్రధానమైన అంశం. వినియోగదారులకు మనం ఇస్తామన్న గ్రేడు బొగ్గును సరఫరా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రేడ్ ఏమాత్రం తగ్గినా సరే కోట్లాది రూపాయల పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే వినియోగదారులు బొగ్గు ధర ఎక్కువగా ఉందని, తగ్గించాలని కోరుతున్నారు, దీనికి తోడు మనం హామీ ఇచ్చిన గ్రేడ్ బొగ్గు ఇవ్వనట్లయితే వారి విశ్వాసాన్ని మరింతగా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి గనుల వద్ద, సీహెచ్ పీ ల వద్ద నాణ్యత పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

సింగరేణి సంస్థను అనేక కష్ట సమయాల్లో బయటకు తీసుకొచ్చిన చరిత్ర మీకు ఉంది, పోరా పటిమ ఉంది. పని చేసే సత్తా ఉంది. ఈ సందర్భంగా మీరు కంపెనీ మనుగడ గురించి లోతుగా ఆలోచించి పని సంస్కృతిని మెరుగుపరచడానికి కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఇవ్వబడిన షిఫ్టులో ఎనిమిది గంటలు సమయాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతీ షిఫ్టులో భారీ యంత్రాలను ఎనిమిది గంటల సమయం వినియోగించేలా చూడాలి.

సంస్థ ఉంటేనే మనం ఉంటాం, సంస్థ నిలబడాలంటే వినియోగదారులు మనతో ఉండాలి, వినియోగదారులు మనతో ఉండాలంటే బొగ్గు ధర తగ్గాలి, బొగ్గు ధర తగ్గించాలంటే మనం బాగా పనిచేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

సంస్థలో ఇప్పుడు 25,000 మంది వరకు యువ కార్మికులు ఉన్నారు. యువ కార్మికులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. సీనియర్ కార్మికుల నుంచి పని మెలకువలు తెలుసుకుంటూ, వారితో కలిసిమెలిసి రక్షణతో పనిచేస్తూ లక్ష్యాలు సాధించాలని  కోరారు.

సింగరేణి సంస్థను పది కాలాల పాటు నిలపాలనే ఉద్దేశంతోనే వివిధ రకాల వ్యాపార విస్తరణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులను సాధించుకోవడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ ను ఈ మధ్యనే ప్రారంభించాము, కొత్తగూడెంలో వీకే ఓపెన్ కాస్ట్ గనిని, ఇల్లందులోని రొంపేడు ఓపెన్ కాస్ట్ గనిని, రామగుండంలో రామగుండం కోల్ మైన్, బెల్లంపల్లిలోని గోలేటి ఓపెన్ కాస్ట్ గనులను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ను మేడిపల్లి ఓపెన్ కాస్ట్ పాత సంపుపై ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే గ్రీన్ హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ నుండి మిథనాల్ తయారీ ప్లాంట్ వంటివి చేపట్టబోతున్నాం అని అన్నారు.

కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే కోటి 25 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం జరిగింది, కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది, కార్మికుల బిడ్డలకు కూడా సివిల్స్ లో లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లయితే లక్ష రూపాయల ప్రోత్సాహక నగదు బహూకరించడం జరుగుతుంది, పలుచోట్ల కొత్తగా ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేపట్టి వాటిని ప్రారంభిచుకున్నామని తెలిపారు.

సంక్షేమం విషయంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ నంబర్ వన్ గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సమయంలో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేస్తున్నాను. హెడ్ ఆఫీస్ లో కూడా ఇటీవలనే ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా అటెండెన్స్ అనే పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది ఇదే పద్ధతి ఇతర గనులలో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అని తెలిపారు.

ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంపొందించడం ద్వారా మంచి ఉత్పాదకత సాధించాలన్నదే ప్రధాన లక్ష్యం. కాబట్టి కార్మికులు, అధికారులు అందరూ ఉత్పాదకత పెంపుదలకు, పని గంటలు సద్వినియోగానికి సహకరించాలని ప్రతి ఒక్కరూ ఇది నా సంస్థ అనే భావనతో పనిచేయాలని కోరారు.

అనంతరం 79వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంధర్భముగా సింగరేణి లోని 11 ఏరియాల నుండి ఎంపిక చేసిన 13 మంది ఉత్తమ ఉద్యోగులయిన  శ్రీ ఎం.మురళి, ట్రామర్, కే‌టి‌కే-1 ఇంక్లయిన్, భూపాల పల్లి ఏరియా , కే.కృష్ణ, ఈ‌పి ఆపరేటర్,ఓ‌సి-2, ఆర్‌జి-III ఏరియా, శ్రీ ఎన్.మల్లేష్, మల్టీ జాబ్ వర్కర్, అడ్రియాల ప్రాజెక్ట్, అడ్రియాల (ఏ‌ఎల్‌పి) ఏరియా,  శ్రీ జే.లక్ష్మయ్య , ఈ.పి.ఆపరేటర్,ఓ‌సి‌పి-III, ఆర్‌జి-II ఏరియా, శ్రీ ఆర్.లక్ష్మీనారాయణ, ఈ.పి.ఆపరేటర్, జి‌డి‌కే-సి‌ఎం(2,2ఏ&5), ఆర్‌జి-I ఏరియా,  శ్రీ రామ్ కిషన్, ఈ‌పి హెల్పర్/గ్రీసర్, గోలేటి సి‌హెచ్‌పి, ఆర్‌జి-I ఏరియా,  శ్రీ రామ్ కిషన్, ఈ‌పి హెల్పర్/గ్రీసర్, గోలేటి సి‌హెచ్‌పి, బెల్లంపల్లి ఏరియా, శ్రీ పి.అంకులు, కోల్ కట్టర్, కాశిపేట్ 1 ఇంక్లయిన్, మందమర్రి ఏరియా, శ్రీ  ఏ.మధుసూదన్ రావు, ఫోర్మన్(మెకానికల్) డి‌హెచ్, ఎస్‌ఆర్‌పి-3 & 3ఏ ఇంక్లయిన్, శ్రీరాంపుర్ ఏరియా, శ్రీ ఏ.ఆంజనేయులు, ఈ‌పి ఆపరేటర్, పి‌కే‌ఓ‌సి-II, మణుగూరు ఏరియా, శ్రీ బి.సీతారాములు, ఫిట్టర్, కే‌ఓ‌సి, ఇల్లందు  ఏరియా, శ్రీ బి.కుమార కృష్ణ, టెండల్, పి‌వి‌కే-5 ఇంక్లయిన్, కొత్తగూడెం ఏరియా, శ్రీ జే.పర్సయ్య, సీనియర్ ఆసిస్టంట్, ఎస్‌టి‌పి‌పి, శ్రీ జి.వెంకట రావు, సీనియర్ లా ఆఫీసర్, లా డిపార్ట్మెంట్, హైదరాబాద్ లను సన్మానించారు.

అనంతరం కొత్తగూడెం లోని వివిధ కళాశాల మరియు పాఠశాలల విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.

జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరాం, ఐ‌ఆర్‌ఎస్ గారు,  విశిష్ఠ అతిధులుగా కొత్తగూడెం శాశన సభ్యులు శ్రీ కునంనేని సాంబ శివ రావు గారు,  డైరక్టర్(ఈ&ఎం) డి.సత్యనారాయణ రావు,  డైరక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరక్టర్(పి&పి) కె.వేంకటేశ్వర్లు, సింగరేణి డైరక్టర్(పా) శ్రీ గౌతమ్  పొట్రు, ఐ‌ఏ‌ఎస్ ,  గుర్తింపు సంఘం (ఏ‌ఐ‌టి‌యూ‌సి) జనరల్ సెక్రటరీ  కే.రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘం(ఐ‌ఎన్‌టి‌యూ‌సి)  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్, సింగరేణి సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మి పతి గౌడ్,  కార్పొరేట్ పరిధిలోని వివిధ శాఖల జనరల్ మేనేజర్లు, వివిధ శాఖల అధిపతులు, యూనియన్ నాయకులు, ఉత్తమ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, వెల్ఫేర్ సిబ్బంధి, ఎస్&పి‌సి సిబ్బంధి, సేవ సెక్రటరీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కళాకారులు మరియు కళాశాల మరియు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.