భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు - Namasthe Bharat

భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తేదీ, మే 07, 2025-
నమస్తే భరత్

నిర్మల్:- జిల్లా
కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్  మాట్లాడుతూ, కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ రికార్డులలో పేరు, విస్తీర్ణం లోపాలు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో భూములు, సాదాబైనామాలు, హద్దుల తగాదాలు తదితర సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడుతున్నాయని వివరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని, ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి దరఖాస్తుకూ రశీదు ఇవ్వాలని, సత్వర విచారణ అనంతరం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్‌ల నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.  అనంతరం సమీపంలోని జొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, రెవెన్యూ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.