జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి - Namasthe Bharat

జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
నమస్తే భారత్ :-కురవి : జర్నలిస్టులందరికీ ఇంటి స్థలంతో పాటు  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కొరవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న అర్హులైన నిరుపేద జర్నలిస్టులందరికీ  గత ప్రభుత్వాలు ఇంటి స్థలంతో పాటు గృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని అన్నారు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూం ఇస్తామని కాలయాపన చేసి జర్నలిస్ట్ లను మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అయన కోరారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం ముందు ఆందోళన చేయడం జరిగిందన్నారు. ఆ క్రమంలో రాంచంద్రునాయక్ సంఘీభావం తెలిపిన అయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డోర్నకల్ నియోజకవర్గంలో గెలుస్తే ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే గా గెలుపొందిన డా. రాంచంద్రునాయక్ ఇచ్చిన హామీ మేరకు  జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం తో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని సహదేవ్ కోరారు ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ అనుగోజు పూర్ణచందర్రావు, గండమాల రోషయ్య, పొన్నేబోయిన వెంకన్న, కమాటం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.