దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - Namasthe Bharat

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) :రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం అధికారులకు సూచించారు.  భూభారతి చట్టం అమలుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలలో  భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.   మద్దూరు మండలంలోని  దమ్ ఘన్ పూర్, నాగిరెడ్డి పల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ తో కలిసిఆమె సందర్శించారు. దమగాన్ పూర్ సదస్సులో 42 మందికి గతంలో  ఇళ్ల  పట్టాలు ఇచ్చినా నేటికి స్థలాల ను మాత్రం కేటాయించలేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  స్పందించిన కలెక్టర్   వారినుంచి దరఖాస్తులు తీసుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తహసిల్దార్ మహేష్ గౌడ్ కు సూచించారు. గ్రామాలలో ఎక్కువగా రైతులు ఎలాంటి భూ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారని అక్కడి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  రైతుల చిన్న చిన్న సమస్యలను అధికారులు మోకా లోనే  పరిష్కరించాలన్నారు.  అనంతరం   కలెక్టర్ మద్దూరు తహాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని  భూ భారతి ఫైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ఇంతవరకు మండలంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో గ్రామాల వారీగా రైతులు ఇచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యల పై  గంట పాటు  అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీఓ రామచంద్ర నాయక్, ఫైలెట్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ అధికారుల బృందం తో సుదీర్ఘంగా చర్చించి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.