warangal-collectorate-waddha-asha-workers-dharna - Namasthe Bharat

వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా
నర్సంపేట ,మార్చి 24 (నమస్తే భారత్  ) : ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్ల సంఘం ( బి ఆర్ టి యు అనుబంధ )  బి.ఆర్ .టి.యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కాలువల లలిత విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్ల సంఘం ( బి ఆర్ టి యు అనుబంధ )
ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుండి భారీ ప్రదర్శన నిర్వహించి, వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆశా వర్కర్ల ధర్నాకు మద్దతుగా నిలిచిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 18 వేల కనీస వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన ఆ దిశగా ప్రభుత్వ చర్యలు లేవని, మొన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఆశా వర్కర్లకు ఒక్కరూపాయి కేటాయించకుండా 18 వేల రూపాయల వేతనం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో ఇద్దరు మహిళలు ఉన్న ఆశా ఆడబిడ్డలు రోడ్ల మీదకి వస్తున్నా వారికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉంటే వారి కుటుంబాల జీవనం కొనసాగడం ఎలా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బి.ఆర్.ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బండారి మంజుల, బి ఆర్ టి యు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి, వరంగల్ బిఆర్ టి యు జిల్లా నాయకులు పాలడుగుల రమేష్, నాయకులు మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.