they-got-a-stay-and-stopped-the-above-notification - Namasthe Bharat

స్టే తెచ్చుకున్నారు… ఆ పై నోటిఫికేషన్ ఆపేశారు..?
– ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన “మకుట”

– నిర్మాణ అనుమతుల రద్దు ప్రక్రియకు 2025 ఆగస్టు నెలలో స్టే తెచ్చుకున్న “మకుట హారిజన్”

– అనంతరం అక్టోబర్ నెలలో ఫాక్స్ సాగర్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ కలెక్టర్ కు అభ్యర్థన

– ఈ మేరకు అప్పటి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హెచ్ఎండిఏ కు లేఖ

– చెరువు బఫర్ జోన్ లోకి వస్తుందని నివేదికలపై..

– ఫాక్స్ సాగర్ ఫైనల్ నోటిఫికేషన్ పై ఇప్పటివరకు లేని చర్యలు

– చర్యలు తీసుకోవద్దంటూ స్టే తెచ్చుకున్న నిర్మాణ సంస్థపై..

– నిర్మాణ పనులను ఆపేలా అధికారి యంత్రాంగం అడ్రస్ తెచ్చుకోలేకపోయింది

– దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ పనులు చక చక..

– జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ నిర్మాణాలపై నేటి వరకు లేని చర్యలు

నమస్తే భారత్, కుత్బుల్లాపూర్: ఓ నిర్మాణ సంస్థకు చెందిన భారీ నిర్మాణం చెరువు యొక్క బఫెలో జోన్ ప్రాంతంలోకి వస్తుందని అధికారులు నివేదికలు ఇవ్వడం ఆపై ఆ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులకు రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేయటం వంటి పరిమాణాలతో సదరు నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలంటూ అధికారుల చర్య పై “స్టే” తెచ్చుకుంది. అంతేకాదు ఆ చెరువు యొక్క ఫైనల్ నోటిఫికేషన్ కూడా విచారణ అయ్యేంతవరకు ఆపాలని అభ్యర్థించడం దానికి అధికారి యంత్రాంగం హెచ్ఎండిఏ కు సిఫార్సు చేయటం వంటివి చక చక జరిగిపోయాయి. కానీ చెరువులో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణం మాత్రం ఆగలేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో జరుగుతున్న “మకుట హొరిజన్” నిర్మాణ పనులపై విమర్శలు తలెత్తుతున్నాయి.

నిర్మాణ అనుమతులు రద్దు చేయద్దు..
కొంపల్లి గ్రామంలోని ఫాక్స్ సాగర్ (జీడిమెట్ల చెరువు) బఫర్ జోన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు నెలలో మకుట డెవలపర్స్ చేపట్టిన ప్రాజెక్టుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కొంపల్లి మున్సిపాలిటీని ఆదేశిస్తూ స్టే విధించింది. సర్వే నంబర్లు 179/P, 180లో మకుట డెవలపర్స్ నిర్మాణాలను చేపట్టింది. అయితే, ఈ నిర్మాణాలు ఫాక్స్ సాగర్ నాలా బఫర్ జోన్‌లో ఉన్నాయని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా, కొంపల్లి మున్సిపాలిటీ గతంలో ఇచ్చిన నిర్మాణ అనుమతులను రద్దు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. దీనిని సవాలు చేస్తూ డెవలపర్స్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది మకుట డెవలపర్స్. రీ-సర్వే నిర్వహించకుండానే తమ అనుమతులను రద్దు చేయడం చట్టవిరుద్ధమని, హెచ్ ఎం డి ఎ, మున్సిపల్ అధికారుల నుండి అన్ని అనుమతులు పొంది నిర్మాణ పనులు జరుపుతున్నామని పిటిషన్ లో తెలిపారు. దీంతో
సెప్టెంబర్ 15, 2025 నిర్మాణాలపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.

ఫైనల్ నోటిఫికేషన్ పై కూడా..
ఫాక్స్ సాగర్ విచారణ ఫలితం తేలే వరకు తుది నోటిఫికేషన్‌ను ఖరారు చేయవద్దని మకుట డెవలపర్స్ నిర్మాణ సంస్థ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వీరి అభ్యర్థన మేరకు అప్పటి జిల్లా అడిషనల్ కలెక్టర్ హెచ్ఎండిఏ కు లేఖ రాశారు. దీంతో ఫాక్ సాగర్ ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఫాక్స్ సాగర్ చెరువుకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ గతంలోని సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.

మకుట డెవలపర్స్ పై ఆరోపణలు ఏమిటి..?
2013 లో సర్వే ఆఫ్ లేక్స్ ఇన్ జిహెచ్ఎంసి ఏరియా ప్రాజెక్టులో భాగంగా అప్పటి అధికారులు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును సర్వే చేసి ప్రాథమికంగా హద్దులను నిర్ణయించారు. జీడిమెట్ల, కొంపల్లి, దూలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వివిధ సర్వే నెంబర్ల లో ఈ చెరువు దాదాపుగా 482 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్నదని పేర్కొంటూ వాటికి హద్దులుగా 88 కోఆర్డినేట్స్ లతో చెరువు యొక్క నక్ష ను రూపొందించారు. దీని ప్రకారం మకుట హారిజన్ వారు చేపట్టిన భారీ నిర్మాణం ఫాక్స్ సాగర్ చెరువు కోఆర్డినేట్స్ 58, 59 లా మధ్య ఉన్న బఫర్ జోన్ ప్రాంతంలో వస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అని చెబుతున్నారు. ఆధారంగా హెచ్ఎండిఎల్ లేక్స్ లో ఫాక్స్ సాగర్ చెరువు యొక్క ఎఫ్ టి ఎల్ , కడస్ట్రాల్ మ్యాప్స్ లను ఆధారంగా చూపిస్తున్నారు. కాగా కఠిన చర్యలు తీసుకోకుండా నిర్మాణ సంస్థ న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్న సందర్భంలో, అదే రీతిలో నిర్మాణ సంస్థ కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకుండా అనే కోణంలో అధికారులు కోర్టు నుంచి ఆర్డర్లు ఎందుకు పొందలేకపోయారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.