ఆదివారం చిల్లంచర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Namasthe Bharat

ఆదివారం చిల్లంచర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నమస్తే భారత్ :-మరిపెడ : ఈనెల 27 ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లొని చిల్లంచర్ల గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రగతి సేవా సమితి మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు తెలిపారు. ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ ఆదేశానుసారం మండల నలుమూలలకు ఉచిత కంటి ఆపరేషన్ పై అవగాహన కల్పిస్తు ప్రచారం చేస్తున్న సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని చిల్లంచర్ల గ్రామ స్థానిక ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాలలో రివ్యూ సమావేశం నిర్వహించిన అనంతరం ఐనాల పరశురాములు మాట్లాడుతూ ఈనెల 27 ఆదివారం రోజున మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణ లొ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామని తెలిపారు. ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి వచ్చే రోగులు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు జీరాక్స్ లు మరియు ఫోన్ నెంబర్, వారు వివిధ జబ్బులకు రోజు వాడే మందులు తప్పని సరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారు మాత్రమే వెంట సహాయకులను తీసుకొని రావాలని , వెంట ఒక జత బట్టలు అవసరమైన సామాగ్రి తెచ్చుకోవలని కోరారు.ఈకార్యక్రమంలో ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త, తానంచర్ల ఏరియా కో ఆర్డినేటర్ తప్పేట్ల సతీష్, చిల్లంచర్ల కో ఆర్డినేటర్ ఆలువాల మంజుల మరిపెడ టౌన్ కో ఆర్డినేటర్ బోడ తుల్సా నాయక్, అబ్బాయి పాలెం కో ఆర్డినేటర్ జినక క్రిష్ణమూర్తి, యల్లంపేట కో ఆర్డినేటర్ నలబోతు విజయ తదితరులు పాల్గొన్నారు.