భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి - Namasthe Bharat

భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 24)  :  భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చే భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సదస్సులలో  వచ్చిన సమస్యలు తహసిల్దార్ స్థాయిలో ఉంటే వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం  రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ మద్దూరు మండలంలోని భీంపూర్, నాగం పల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించి, సదస్సులకు ఎలాంటి భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మద్దూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ హాజరయ్యారు.  అవసరమైతే సదస్సుల నిర్వహణకు అధికారుల బృందాలను పెంచాలన్నారు. ఫైలెట్ ప్రాజెక్టు గా మద్దూరు మండలం ఎంపిక చేయబడిందని, యుద్ద  ప్రాతిపదికన  పనులు పూర్తి కావాలని  ఆమె అధికారులకు సూచించారు. గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో క్యాటగిరిల వారీగా విభజించాలని తెలిపారు. మద్దూరు మండలంలో రెవెన్యూ సదస్సులు పూర్తి అయ్యే వరకు మద్దూరు మండలంలోనే ఉండాలని ఆర్డీఓ రామచంద్రనాయక్ కు కలెక్టర్ సూచించారు.  ఈ కార్యక్రమంలో మద్దూరు తహసిల్దార్ మహేష్ గౌడ్, డీ టీ వాసుదేవ రావు, ఆర్. ఐ. లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.