mahatma-jyotirao-phules-death-anniversary-celebrated-under-the-auspices-of - Namasthe Bharat

జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
*ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామక్రిష్ణ*

*వడ్డెర్ల అభ్యున్నతి కోసం కృషి చేస్తా...*

తెలంగాణ పత్రిక, హైదారాబాద్, నవంబర్ 29:

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం జాతీయ అధ్యక్షులు జాతీయ వడ్డెర సంఘం పీట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో అత్తాపూర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామక్రిష్ణ లు హాజరయ్యారు. అనంతరం ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు, బడుగ, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం కలిసి నడుద్దామన్నారు. భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వడ్డెర సామాజిక వర్గం సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. వడ్డెర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేస్తామని, స్థానికంగా ఉన్న వడ్డెర బస్తీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వడ్డెర సమాజం విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే అన్నారు. స్థానికంగా ఉన్న వడ్డెరల మౌలిక సదుపాయాల పరంగా అవసరమైన చర్యలను చేపడతామని భరోసా ఇచ్చారు. వడ్డెర్లను ఆర్థిక–సామాజికంగా మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆదాయం, అంటరానితనం విముక్తి చేయటానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లేపు శివకుమార్, జాతీయ యువజన అధ్యక్షుడు వేముల భరత్, జాతీయ కోశాధికారి బత్తుల లక్ష్మి కాంతయ్య, జాతీయ ఉపాధ్యక్షుడు దండుగుల మైసయ్య, గ్రేటర్ అధ్యక్షుడు బోదాసు రవి, గ్రేటర్ మహిళ అధ్యక్షురాలు మక్కల ధనలక్ష్మి, జాతీయ కార్యదర్శి పల్లపు రమేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జెరుపటి రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముధంగుల ఆంజనేయులు, జెరిపాటి మధు, గోగుల రమేష్, గుంజ ఆంజనేయులు, లక్ష్మి నారాయణ, వల్లేపు గిరీష్, దండుగుల రామకృష్ణ, కోమీరే శ్రీనివాస్, వేముల యాదయ్య, పిట్ల ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.