ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. - Namasthe Bharat

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
తేదీ,  ఏప్రిల్ 22, 2025-
నమస్తే భారత్

నిర్మల్:-జిల్లా మంగళవారం ఆయన సభ్యులతో కలసి జిల్లాలో పర్యటించారు. సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన బృందంతో కలిసి తనిఖీ చేశారు. చిన్నపిల్లలు, గర్భిణులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించి, ఎలాంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. తరువాత జామ్ గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, వారికి అందుతున్న ఆహారంపై సమాచారం సేకరించారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం తీసుకుని శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని, సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అవసరమని అన్నారు. కడ్తాల్ గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం అర్హులకూ చేరేలా చూడాలని రేషన్ డీలర్లకు సూచించారు. పంపిణీ చేసే బియ్యంలో పోషక విలువలు ఉన్నాయని చెప్పారు. అనంతరం బియ్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు.  ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కమిషన్ సభ్యులు వి.ఆనంద్, ఆర్.శారద, ఎం.భారతి, బి.జ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డిఈఓ పి.రామారావు, డిఎంహెచ్వో రాజేందర్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జిల్లా సంక్షేమశాఖ అధికారులు శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, మోహన్ సింగ్, అంబాజీ తదితరులు పాల్గొన్నారు.