ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు. - Namasthe Bharat

ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు.
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:ఇంటర్ ఫలితాలు విడుదలైన ఈ సమయంలో, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై విజయాన్ని అందుకున్న విద్యార్థులందరికి హృదయపూర్వక అభినందనలు. మీరు చూపిన కృషి, పట్టుదల తప్పకుండా అభినందనీయమైనవి. మీరు రేపటి భారత భవిష్యత్తు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలవాలి.అయితే, ఈ సందర్భంలో ప్రత్యేకంగా పేయిల్ అయిన విద్యార్థుల గురించి మాట్లాడాలి అనిపిస్తోంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం గుండెల్లో ఏదో భారం మోస్తున్నారు. కానీ అది శాశ్వతం కాదు, అది ఓ తాత్కాలిక జారుడు బండిని మించినది కాదు.పరీక్షలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు.బహుశా మీరు ప్రయత్నించారు, కానీ కొన్ని కారణాల వల్ల ఫలితాలు అనుకున్నట్టు రాలేదేమో. అది మీ లోపం కాదు, అది ఒక అవకాశం – మీరు ఎంత బలంగా తిరిగి రావాలో తెలియజేసే పరీక్ష.పెయిల్ అయ్యారని గుండె చెదరుకోవద్దు.విజయానికి వెళ్లే దారి చిన్న చిన్న ఓటముల గుండా పోతుంది. ఈ ఫలితాలు మీ నిజమైన సామర్థ్యానికి కొలమానం కావు. మీ శ్రమకు విలువ ఇవ్వండి, మీ కలలకు మళ్లీ రైల్ ఎక్కించండి. మళ్లీ ప్రయత్నించండి, ఈ సారి గెలుపు తప్పదనే నమ్మకం పెంచుకోండి.నేను వ్యక్తిగతంగా – మీకోసం ఉన్నాం. మీరు ఎక్కడ కూలిపోతే అక్కడే మిమ్మల్ని లేపేందుకు, ముందుకు నడిపించేందుకు మేమున్నాం.మీరు గెలవాలి. మీ కుటుంబానికి గర్వకారణంగా నిలవాలి. ఈరోజు పేయిల్ అయినా, రేపు మీరు టాప్‌ర్స్ లిస్ట్‌లో ఉండాలన్నదే మా ఆకాంక్ష.