un - Namasthe Bharat

UN : ఐక్యరాజ్యసమితి దినోత్సవం
ఐక్యరాజ్యసమితి ఆశయాలు:

సభ్యదేశాల మధ్య యుద్ధాలు జరుగకుండ చూడటం.

అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం.

దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం.

అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం.

సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడంతోపాటు ప్రపంచ దేశాల మధ్య వచ్చే అనేక అభిప్రాయ బేధాలను పరిష్కరించే పెద్దమనిషిగా వ్యవహరించడం వంటివి. ఐక్యరాజ్యసమితి 6 ప్రధాన అంగాలను కలిగి ఉంది.

1. సర్వ ప్రతినిధి సభ - ఈ సభలో దేశాలన్నిటికి ప్రాతినిధ్యంతో పాటు సమాన ఓటు హక్కు కలిగి ఉంటాయి. సంవత్సరమునకు ఒక పర్యాయం సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షుణ్ణి సభ్యదేశాలు ఎన్నిక చేస్తాయి. క్రొత్త దేశాలకు సభ్యత్వం కల్పించేందుకు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయడంలో ఈ సభకు అధికారము ఉంటుంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారము కూడా ఈ సభకే ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది.

2. భద్రతా మండలి - సమితి ప్రారంభమయ్యే నాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాల వ్యవధి కొరకు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నుకోబడతాయి. శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా మరియు ఫ్రాన్స్ లు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుండి ఇందులో ప్రధానంగా రెండు మార్పులు చేశారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలు ఉండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా, ఆఫ్రికా దేశాల నుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాల నుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపా నుండి ఒకరు ఎన్నిక అవుతుంటారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణసభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి మాసానికొకమాకు అధ్యక్షుడు మారుతూ ఉంటాడు. భద్రతా మండలి తమ ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిమచడమే కాకుండా సైనిక చర్యలను చేపట్టే అధికారం కూడా కలిగి ఉంటుంది.

3. సచివాలయం - సమితి వ్యవహారాలను నిర్వహించే కార్యనిర్వాహక విభాగం యిది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంటుంది. దీనిలో పదివేలకు పైగా ఉద్యోగులు పని చేస్తూ ఉంటారు. సచివాలయానికి ప్రధాన అధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. సమితి వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవసరమైన సమాచారం, అధ్యయనం, సదుపాయాల వంటి విషయాలు సచివాలయ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. సమితి శాంతి సైనిక దళాలు (బ్లూ హెల్మెట్స్) కూడ సచివాలయం ఆధీనంలో పనిచేస్తాయి.

4. ధర్మకర్తృత్వ మండలి - కొన్ని పాశ్చాత్య దేశాల వలసపాలన క్రింద కొనసాగిన దేశాల భూభాగాల ప్రయోజనాలను కాపాడటం దీని ప్రధాన లక్ష్యం. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉంటాయి.

5. ఆర్థిక, సాంఘిక మండలి - ఇది సాధారణ సభ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులు ఉంటారు. ఈ మండలి యేటా రెండు సార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం, విద్యా, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవహక్కులను సమర్థించడం వంటివి దీని ప్రధాన ఆశయాలు.

6. అంతర్జాతీయ న్యాయస్థానం - ఇదే ప్రపంచ న్యాయస్థానంగా పిలువబడుతుంది. ఇది సమితి యొక్క ప్రాథమిక తీర్పులను ప్రకటించే విభాగం. దీని కార్యాలయం నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో గల శాంతి సౌధంలో ఉంది. సభ్యుదేశాల ద్వారా సమర్పించబడిన న్యాయ వాదనలు అలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండు వేరు వేరు సంస్థలు. వీటి రెండింటికి ప్రపంచ పరిధి ఉంది" అని అన్నారు.

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఒప్పందాల ద్వారా సమితి అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయి. ఇవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఈ అనుబంధ సంస్థలకు సమితి ఆర్థిక, సామాజిక మండలి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు : JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

విద్యా, వైజ్ఞానిక అనుబంధ సంస్థలు:

1. UNESCO ( విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ). దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది.
2. UNICEF ( బాలల అత్యవసర నిధి). దీని కార్యాలయం న్యూయార్క్ లో ఉంది.
3. UNDP (అభివృద్ధి కార్యకలాపాలు). దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
4. UNEP (పర్యావరణ కార్యక్రమాలు). దీని ప్రధాన కార్యాలయం నైరోబీలోని కెన్యా నగరంలో ఉంది.
5. FAO (ఆహార మరియు వ్యవసాయ సంస్థ). దీని ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది.
6. ILO (అంతర్జాతీయ కార్మిక సంస్థ). దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జనీవా నగరంలో ఉంది.
7. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ). దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉంది.
8. UNIDO (పారిశ్రామిక అభివృద్ధి సంస్థ). దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా దేశంలో గల వియత్నాంలో ఉంది.
9. UNHCR (శరణార్ధుల హై కమిషనర్). దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
10. UPU (విశ్వ తపాల సంఘం). దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని బెర్న్ నగరంలో ఉంది.
11. WMO (వాతావరణ సంస్థ). దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
12. IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ). దీని ప్రధాన కార్యాలయం వియన్నాంలో ఉంది.
13. UNCTAD (వాణిజ్య అభివృద్ధి సంస్థ). దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది .
14. UTU (అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్). దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
15. IBRD / World Bank (ప్రపంచ బ్యాంకు). దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీ. సీ. లో ఉంది. దీనికి మూడు ప్రధాన అనుబంధ సంస్థలు ఉన్నాయి. అవి IDA, IFC మరియు MIGA.
16. IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి). దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీ. సీ. లో ఉంది.
17. UNWOMEN (మహిళా సాధికారత కార్యకలాపాలు). దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.

ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలన్నింటిలో కూడా సెక్రటరీ జనరల్ కీలకపాత్ర వహిస్తాడు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ప్రపంచమంతటా పర్యటించడం, దేశాధినేతలతో మరియు అధికారులతో నిత్యము సంప్రదింపులు జరుపడంతో పాటు పర్యటనలు చేస్తూ ఉంటారు. వీరి కాలపరిమితి 5 సంవత్సరములు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ అంటోనియా గుటే రైస్. సమితి ప్రతి సంవత్సరం ఒక విషయం మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టి సారించింది అని తెలిపారు.

ఈ రోజు ఐక్యరాజ్యసమితి ఎదుర్కొంటున్న సమస్యలు :

1) అగ్రదేశాల దురహంకార వైఖరి
2) ఆయుధపోటీ
3) తీవ్రవాదం, అంతర్జాతీయ ఉగ్రవాదం
4) పర్యావరణ కాలుష్యము, వాతావరణంలో మార్పులు
5) మానవహక్కుల ఉల్లంఘనలు
6) భద్రతామండలి పెద్ద దేశాల చేతిలో కీలుబొమ్మ
7) అంతర్జాతీయ వలసలు
8) మూడో ప్రపంచ దేశాల్లో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగిత
9) సాంకేతిక పరిజ్ఞానం పేద దేశాలకు బదిలీ కాకపోవడం
10) నయావలసవాదం, సహజ వనరుల దోపిడీ
ఐక్యరాజ్యసమితి పై సమస్యలను అధిగమ్ంచాలని కోరుకుందాము.

"ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి రెండు దేశాలు తాత్కాలికంగా గుర్తించ బడ్డాయి. భారతదేశానికి కూడా త్వరలో UN భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాల సరసన చేరుతుందని ఆశిద్దాం. అప్పుడే మన దేశ ప్రభావం కూడా ప్రపంచ దేశాలపై ఉంటుంది" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat