రైతాంగానికి గోదావరి జలాలు ఇవ్వాలి - Namasthe Bharat

రైతాంగానికి గోదావరి జలాలు ఇవ్వాలి
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం  బ్యూరో: సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సాగు భూములకు గోదావరి జలాలు సాదించడం కోసం ఈనెల 25వ తేదీన కొత్తగూడెంలో జరిగే జిల్లా సదస్సు ప్రదర్శనలో జిల్లా రైతులు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మించి జిల్లా రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వకుండా తరలిస్తే సిపిఎం చూస్తూ ఊరుకోదని అన్నారు. సిపిఎం నిర్వహించిన అనేక పోరాటాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సాగు భూములన్నింటికీ గోదావరి జిల్లాల సాధనకోసమేనని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సాగు భూములు తీసుకుంటారు కానీ వారికి సాగునీరు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం ఇష్టపడటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ డిజైన్లు మార్చడం వల్ల కొత్తగూడెం నియోజకవర్గం కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి రోల్లపాడు రిజర్వాయర్ ద్వారా ఇల్లందు నియోజకవర్గానికి రావలసిన సాగు నీరు రాకుండా కుట్ర జరిగిందని విమర్శించారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు కాలువ ప్రవహించే  మండలాల్లో ఉన్న చెరువులకు అనుసంధానం చేసి జిల్లాలో ఉన్న సాగు భూములన్నింటికీ గోదావరి జలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు  ఈ పోరాటాల రూపకల్పనకు జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని రాజకీయాలకతీతంగా రైతులు కదిలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, ఎం జ్యోతి, కొలగాని బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.