విరశైవ జంగమ స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం - Namasthe Bharat

విరశైవ జంగమ స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్ 20:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదర్ గూడ మండలం తుంపల్లి గ్రామపంచాయతీ శివారులో గల సర్వే నెంబర్ 161 లో 35 గుంటలు సుమారు 200 ఏండ్ల క్రితం నుండి విరశైవ జంగమ సమాధుల కొరకు కేటాయించారు. అట్టి భూమిని జంగమ సంఘమ్ వారు సమాధుల కొరకు వినయోగించుకుంటున్నారు. ఈ సందర్బంగా కొన్ని రోజుల క్రితం విరశైవ జంగమ సంఘమ్ కు చెందిన శివపూజ శాంత లింగం, శివాపూజ ప్రభాకర్, మఠం రాజశేఖర్ సదరు భూమిని సర్వే చేయిస్తే అక్కడ 20 గుంటలు భూమి మాత్రమే మిగిలి ఉంది. మిగతా భూమి ఎక్కడ పోయింది అని వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం కు వెళ్లి ఇట్టి భూమి సర్వే నెంబర్ 161 లో ఉండాల్సిన 35 గుంటలు బదులు 20 గుంటలే మిగిలి ఉందని దానిని మళ్ళీ సర్వే చేయించి మా పూర్వికుల నుండి ఉన్న 35 గుంటలు మాకు ఇప్పించి న్యాయం చేయాలనీ దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టి 2 నెలలు కావస్తున్న ఇప్పటివరకు స్థానిక అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఇట్టి భూమిని టీ పాన్ ప్రకారం సర్వే చేయించి మాకు సత్వరమే న్యాయం చేయాలంటు వారు కోరుతున్నారు.